ముంచేసిన మొంథా.. ఆ ప్రాంతాలు అతలాకుతలం
తుఫాన్ దాటికి ఏపీ మొత్తం గజగజలాడింది. జోరువాన, హోరుగాలులకు వరిచేలు వెన్నువిరిగింది. చేతికి రావాల్సిన పత్తి గాలికి కొట్టుకుపోయింది. అరటి, బొప్పాయి తోటలు చాపచుట్టినట్టు నేలకొరిగిపోయాయి. ఇలా ఎటు చూసినా బీభత్సమే. ఏ జిల్లాలో చూసినా విధ్వంసం ఆనవాళ్లే..! వాగులు కట్టలు తెంచుకోవడంతో రైతు కళ్లల్లో కన్నీళ్లు ఉప్పొంగాయి.
దీంతో తక్షణ సాయం, నష్టాల అంచనాకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తుఫాన్ వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు… ఒకటి, రెండు రోజుల్లో తుఫాన్ వల్ల సంభవించిన నష్టంపై ప్రాథమిక నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. మొత్తం 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం ఉంది. తుఫాన్ వల్ల ఇద్దరు మృతి చెందారు. 293 మండలాల్లోని 1,696 గ్రామాల్లో వ్యవసాయ పంట నష్టపోయినట్టు అధికారులు చెబుతున్నారు. దాదాపు 1.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అత్యధికంగా 90 వేల ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. దాదాపు 23 వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. సుమారు 11 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతింది. 75 వేల మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. 95 మండలాల్లోని 292 గ్రామాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. తుఫాన్ వల్ల దాదాపు 9 వేలకుపైగా ఎకరాల్లో ఉద్యాన పంటలు ధ్వంసం అయ్యాయి. 39 పశువులు మృత్యువాత పడ్డాయి. చాలా చోట్ల పంచాయతీరాజ్ రహదారులు, బ్రిడ్జిలు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి. సుమారు 1800 కిలోమీటర్ల మేర ఆర్అండ్ బీ రహదారులు దెబ్బతిన్నాయి. ఈ తుఫాన్ వల్ల ఆర్అండ్ బీకి సుమారు 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. తుఫాన్ కారణంగా రూరల్ వాటర్ సప్లయ్‌కు పైపులైన్లు దెబ్బతిన్నాయి. విద్యుత్, ఇరిగేషన్, హౌసింగ్ వంటి శాఖలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. తుపాను నష్టం ఇంకా భారీ ఎత్తున పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొంతాథా తుఫాన్ విషయంలో సమర్థవంతంగా వ్యవహ రించి నష్టనివారణ చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెన్నా నది ఉగ్రరూపం.. నదిలోకి కొట్టుకొచ్చిన బోట్లు
మొంథా ఎఫెక్ట్.. పాఠశాలలకు సెలవు
బంగారం ధర భారీగా తగ్గింది..తులం ఎంతంటే ??
