దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు.. ఏపీకి భారీ వర్ష సూచన

Updated on: Jan 09, 2026 | 7:00 PM

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. శ్రీలంక, తమిళనాడులో భారీ వర్షాలు, జనవరి 10, 11 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రకు వర్ష సూచన. సంక్రాంతి పండుగకు ముందు ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరిక జారీ చేయబడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

మరో గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. చెన్నైకి 1270 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో శ్రీలంక, తమిళనాడులో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈనెల 10, 11 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీకి సంక్రాంతి పండుగకు ముందు తుఫాన్ ముప్పు పొంచి ఉందని చెబుతోంది వాతావరణశాఖ. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కూడా శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి అంటున్నారు. ఈ వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నం, మచిలీపట్నం, గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఒకటో నంబరు హెచ్చరిక జారీ చేసింది. అంతేకాదు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సూచనలను పాటించాలని సూచించారు. ఈశాన్య రుతుపవనాలు డిసెంబర్ 31తో ముగిసిపోయాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో బంగాళాఖాతంలో వాయుగుండాలు, తుఫాన్‌లు ఏర్పడే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ వాయుగుండాలు ఏర్పడినా ఎక్కువగా శ్రీలంకలోనే తీరం దాటాయని చెబుతున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం భయపెడుతోన్న వాయుగుండం ఎక్కడ తీరం దాటుతుందోననే టెన్షన్‌ పట్టుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తుంది.. ఖర్చులపై యువతి ఆవేదన

ముందుకు కదలకుండా ఆగిన అతిపెద్ద శివలింగం

ఇరవైల్లోనే రూ. 9 కోట్ల ఇంటిని సొంతం చేసుకుంది

గురువారం అర్ధరాత్రి 12 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారం క్లోజ్‌