24 గంటల్లో తుఫాన్ వణుకుతున్న తీర ప్రాంతం

Updated on: Nov 25, 2025 | 10:02 PM

ఆంధ్రప్రదేశ్ తీరానికి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. మలేషియా వద్ద ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా మారి, ఆ తర్వాత సెన్‌యార్ తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 4 రోజుల్లో కోస్తా ఆంధ్రపై దీని ప్రభావం చూపుతుందని, భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. రైతులు పంటలను భద్రపరుచుకోవాలని సూచించారు.

ఇవాళ అల్పపీడనం…రేపు వాయుగుండం…ఎల్లుండికి తుఫాన్‌గా మారే చాన్స్‌ ఉందా? ఇదే ఇప్పుడు ఏపీ తీరం గుండెల్లో తుఫాన్ బెల్స్‌ మోగిస్తోంది. మొంథా తుఫాన్‌ మిగిల్చిన నష్టాన్ని మర్చిపోకముందే, మళ్లీ తుఫాన్‌ గండం…ఏపీని తరుముకొస్తోంది. వాయుగుండం రూపంలో ఉరుముతోంది. మలేషియాలోని మలక్కా దగ్గర ఉన్న అల్పపీడనం…రాగల 24 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా కేంద్రీకృతం కానుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుంది. ఆ తర్వాత దక్షిణ బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారే చాన్స్‌ ఉందని తెలిపింది. మలేషియా పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం…సుస్పష్ట అల్పపీడనంగా మారిందని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం చెబుతోంది. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి, దక్షిణ అండమాన్‌ సముద్రం దగ్గర వాయుగుండంగా మాఉతుంది. ఆ తర్వాత అది పశ్చిమ వాయవ్య దిశగానే పయనించి దక్షిణ బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారే ప్రమాదం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అది తుఫాన్‌గా మారాక, దానికి సెన్‌యార్ అని నామకరణం చేయనున్నారు. ఇక శ్రీలంక పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, రేపటికి అల్పపీడనంగా మారుతుంది. ఈ రెండు కలిసి 4 రోజుల తర్వాత కోస్తా ఆంధ్రాపై విరుచుకుపడే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. అప్పటినుంచి భారీ వర్షాలు పడతాయంటున్నారు వాతావరణ అధికారులు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్తగా పంటలను భద్రపరుచుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahavatar Narasimha: ఆస్కార్ బరిలో మహావతార్‌ నరసింహ

Keerthy Suresh: తన వీక్‌నెస్ ఏంటో బయటపెట్టిన కీర్తీ సురేష్‌

TOP 9 ET News: యూట్యూబ్‌పై అఖండ సర్జికల్ స్ట్రైక్.. బాలయ్యా.. మజాకా !!

6,6,6,6,6,6… సిక్సర్ల సునామీ.. 12 బంతుల్లో 50 రన్స్

పంట కాలువలో కొట్టుకుపోయిన కారు డ్రైవర్‌ ఏమయ్యాడంటే