ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు వైసీపీ హాజరు కావడంతో.. బడ్జెట్ సమరం రసవత్తరంగా మారింది. ఇవాళ తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ వివరాలు ఇలా
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు వైసీపీ హాజరు కావడంతో.. బడ్జెట్ సమరం రసవత్తరంగా మారింది. ఇవాళ తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. తర్వాత బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులపాటు సమావేశాలు నిర్వహించాలి, ఏ రోజు ఏ అంశంపై చర్చించాలనే ఎజెండాను ఖరారు చేస్తారు. మొత్తం రెండు లేదా మూడు వారాల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని వైసీపీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. ప్రజాసమస్యలపై గొంతువిప్పేది తాము మాత్రమేనంటూ ప్రతిపక్ష హోదా అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనుంది. అయితే అర్హత లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. సభ్యత్వం పోతుందనే భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారంటూ విమర్శించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించి ఎన్ని రోజులపాటు సమావేశాలు నిర్వహించాలి, ఏ రోజు ఏ అంశంపై చర్చించాలనే ఎజెండాను ఖరారు చేస్తారు. రెండు లేదా మూడు వారాల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
