Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కొనసాగుతోన్న ఓటింగ్.. తరలివస్తోన్న గ్రామీణ ఓటర్లు.. క్యూలైన్‌లో బారులుతీరిన మహిళా ఓటర్లు..

ఏపీలో కొనసాగుతోన్న ఓటింగ్.. తరలివస్తోన్న గ్రామీణ ఓటర్లు.. క్యూలైన్‌లో బారులుతీరిన మహిళా ఓటర్లు..

Ravi Kiran

|

Updated on: May 13, 2024 | 12:48 PM

ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. అన్నిప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే ఛాన్సుంది. అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో..

ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. అన్నిప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే ఛాన్సుంది. అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగుస్తుంది. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకల్లా పోలింగ్‌ ముగుస్తుంది. ఏపీలో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు ఉన్నారు. 46 వేల 389 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 12 వేల 438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 34 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె లాంటి 14 సమస్యాత్మక నియోజకవర్గాల్లో వందశాతం మేర వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

Published on: May 13, 2024 07:10 AM