వామ్మో.. పెద్దపులి వచ్చింది.. శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..

Edited By: Phani CH

Updated on: May 20, 2025 | 12:50 PM

శ్రీశైలం బ్రాహ్మరి పుష్పవనంలో పెద్దపులి కనిపించడంతో కలకలం రేగింది. పులి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అటవీశాఖ, దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానికులకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పులి ఆకలితో, దాహంతో అడవి నుండి వచ్చిందని అనుమానిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అటవీశాఖ చర్యలు తీసుకోవాలి.

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో బ్రాహ్మరి పుష్పవనం వద్ద పెద్దపులి సంచారం కలకలం రేపింది పెద్దపులిని అతి సమీపంలో నుంచి అక్కడ పనిచేసే వర్కర్లు, జెసిబి డ్రైవర్ ఒక్కసారిగా కనబడడంతో భయాందోళనకు గురయ్యారు, పెద్దపులి వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటపడింది పెద్దపులి దృశ్యాలను వైరల్ కావడంతో దేవస్థానం అధికారులు, అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు అటవీ అధికారుల సూచన మేరకు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచనలు చేశారు గతంలో కూడ పలుమార్లు శ్రీశైలం,సున్నిపెంటలో కాలనీలో పెద్ద పులులు, చిరుతపులుల సంచారం చోటుచేసుకుంది నల్లమలకు శ్రీశైలం, సున్నిపెంట సమీపం గ్రామం కావడంతో తరచూ ఊర్లోకి పెద్ద పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు సంచారం పరిపాటిగా మారింది రాత్రి వేళలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు తెలియజేశారు. వీడియోలొ స్పష్టంగా కనిపిస్తున్న పెద్దపులిని చూస్తుంటే… బాగా ఆకలిగా.. దాహంగా ఉన్నట్లు కనిపిస్తోంది. దాహం తీర్చుకునేందుకు లేదా ఆకలి తీర్చుకునేందుకు అడవులు దాటి వచ్చినట్లుగా భావిస్తున్నారు. శ్రీశైలం పరిసరాల్లోకి పెద్ద పులులు చిరుతలు ఎలుగుబండ్లు రాకుండా అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజంతా ఏసీలోనే కూర్చుని ఉంటున్నారా..? పెద్ద ఆపదలో ఉన్నట్టే..!

ఏఐ ను కూడా వదలరా మావ.. ప్రేమలో పడిన మహిళ.. చివరకు

బస్సులో సీటు కోసం.. జుట్టు జుట్టు పట్టుకుని.. పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు

బావ సై అన్నాడు.. భర్తను నై అన్న మహిళ.. చివరికి వామ్మో అలానా..

వాడి కన్ను గుడి మీద పడిందా ?? ఇక నగలన్నీ కనుమరుగే.. చోరీ లో రికార్డు సృష్టించిన దొంగ