మాఘమాసం వేళ మల్లెలకు ఫుల్ డిమాండ్‌..కేజీ ఎంతో తెలుసా ??

|

Feb 21, 2024 | 1:16 PM

మాఘమాసం వచ్చిందంటే.. పెళ్లిళ్ల సీజన్‌ను వెంటపెట్టుకుని వస్తుంది. ఇక ఈ ఏడాది మంచి ముహూర్తాలు ఉండటతో పెళ్లిళ్లు కూడా భారీగానే జరగనున్నాయి. ఇక మాఘమాసం మరో విశిష్టత ఏంటంటే.. మల్లెపూల సీజన్‌ కూడా ఇప్పుడే ప్రారంభమవుతుంది. పెళ్లిళ్లు అంటే మల్లెపూల గుబాళింపు కంపల్సరీ.. ఖరీదు ఎంతైనా మగువలు మల్లెపూలను కొనడానికి ఆసక్తిచూపుతారు. దాంతో ఈ సీజన్‌లో మల్లెపూల ధరలు బాగా పెరిగిపోతాయి.

మాఘమాసం వచ్చిందంటే.. పెళ్లిళ్ల సీజన్‌ను వెంటపెట్టుకుని వస్తుంది. ఇక ఈ ఏడాది మంచి ముహూర్తాలు ఉండటతో పెళ్లిళ్లు కూడా భారీగానే జరగనున్నాయి. ఇక మాఘమాసం మరో విశిష్టత ఏంటంటే.. మల్లెపూల సీజన్‌ కూడా ఇప్పుడే ప్రారంభమవుతుంది. పెళ్లిళ్లు అంటే మల్లెపూల గుబాళింపు కంపల్సరీ.. ఖరీదు ఎంతైనా మగువలు మల్లెపూలను కొనడానికి ఆసక్తిచూపుతారు. దాంతో ఈ సీజన్‌లో మల్లెపూల ధరలు బాగా పెరిగిపోతాయి. సాధారణ రోజుల్లో కిలో 2 నుంచి 3 వందలు పలికే మల్లలు ఇప్పుడు ఏకంగా కిలో వెయ్యిదాటేసింది. ఇందుకు కారణం దిగుబడి లేకపోవడమే అంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మల్లెపూలకు భారీ డిమాండ్ ఏర్పడింది… మాఘ మాసం కావడం మల్లెల సీజన్ కూడా ప్రారంభమైంది.. మరోవైపు శుభకార్యాలు ముమ్మరంగా కొనసాతుండటంతో మల్లెలకు గిరాకీ భారీగా పెరిగింది. సీజన్‌లో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక పోవటంతో వారం రోజులుగా వీటి ధరలు బాగా పెరిగాయి… మైలవరం మండలం మల్లె పూలకు ప్రసిద్ధి..మండలంలోని చండ్రగూడెం మార్కెట్‌లో కిలో రూ.1,200 పలికింది… అయితే రోజుకు సగటున 50 కిలోల దిగుబడులు మించటం లేదని రైతులు చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యువకుడి కక్కుర్తి.. పోలీసు వాహనంతో రీల్స్‌.. కట్‌ చేస్తే సీన్ రివర్స్

Follow us on