అక్టోబర్ 30 వరకే…రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్ వీడియో
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ స్మార్ట్ కార్డులను అందిస్తున్నది. ఇప్పటికే రాష్ట్రం మొత్తంలో 80 శాతం కుటుంబాలకు ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని పూర్తి చేసింది. అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులు రావడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ కార్డుల్లో తప్పుగా నమోదైన వివరాలను సవరణ చేయించుకోవాలని తెలిపింది.
అయితే అక్టోబర్ 30 వరకు మాత్రమే మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అయితే ఇటీవల రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అక్షర దోషాలు, ఇతర తప్పులు రావడంతో రేషన్ కార్డుదారులు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. తమ పేర్లు, వయసు, ఇంటి నెంబర్లు స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పుగా ముద్రించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ రేషన్ కార్డుల్లో సవరణలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం జారీ చేసిన స్మార్ట్ కార్డుల్లో ఏవైనా పేర్లలో తప్పులు సరిచేసుకోవడం.. మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వచ్చే నెల 30వ తేదీ వరకు సమయం ఇస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం :
ట్రంప్ డబుల్ గేమ్..పైకి ప్రేమ.. లోపల ద్వేషం వీడియో
ఎండ ఉన్నంతసేపు ఉరుకతనే ఉంటది..కాకినాడ కుర్రోడి ఖతర్నాక్ ఐడియా వీడియో
