ఏపీలో ప్రజలకు డబుల్ అలర్ట్.. పెరుగుతున్న చలి..పొంచి ఉన్న వానగండం వీడియో
మొంథా తుఫాను ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఏపీని మరో అల్పపీడనం భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత కూడా గణనీయంగా పెరిగింది.
విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నవంబరు 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది వాయుగుండంగా మారే అవకాశం తక్కువే అయినప్పటికీ, దీని ప్రభావంతో ఈ నెల 24 నుంచి 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రానున్న రోజుల్లో అల్పపీడనంపై మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో
మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
వైరల్ వీడియోలు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
