కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..ఈ జిల్లాలకు భారీవర్ష సూచన వీడియో
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడనుంది. దీని ప్రభావంతో అక్టోబరు 22 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, తీరానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మంగళవారం నాటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారవచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో అక్టోబరు 22వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాలకు ఆదివారం పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.
మరిన్ని వీడియోల కోసం :
