Anant Ambani-Radhika Merchant: నభూతో నభవిష్యత్‌..! అనంత్ అంబానీ-రాధిక వెడ్డింగ్ రిసెప్షన్.. లైవ్..

Shaik Madar Saheb

|

Updated on: Jul 13, 2024 | 6:43 PM

నేలమీది నెలరాజును చూసి ఆ చందమామ నివ్వెరపోయాడో లేదో గాని.. శ్రీమంతులకే శ్రీమంతుడైన అంబానీ ఇంట జరిగే మహాపెళ్లి తంతును చూసి జగమంతా నివ్వెరపోయింది. ఔరా అని ఆశ్చర్యపోతుంది. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే..

నేలమీది నెలరాజును చూసి ఆ చందమామ నివ్వెరపోయాడో లేదో గాని.. శ్రీమంతులకే శ్రీమంతుడైన అంబానీ ఇంట జరిగే మహాపెళ్లి తంతును చూసి జగమంతా నివ్వెరపోయింది. ఔరా అని ఆశ్చర్యపోతుంది. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిథుల మధ్య ఏడడుగుల బంధంతో ప్రేమ జంట ఒక్కటైంది. కాగా.. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహానికి తారాలోకం దిగి వచ్చింది. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని రంగాల సినీ ఇండస్ట్రీల ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.. ఆనందోత్సవాలతో ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేశారు. షారుక్‌, రణ్‌వీర్ సింగ్, సల్మాన్‌ ఖాన్‌, విక్కీ కౌశల్‌ కాలు కదిపారు. వారికి రజనీకాంత్‌ జత కలిశారు. ముకేశ్ అంబానీ తన మనవళ్లతో చిందులేశారు. నీతా అంబానీతోపాటు కుటుంబసభ్యులంతా డ్యాన్స్ వేశారు. సెలబ్రిటీల సందడితో ముంబై మిరుమిట్లు గొలిపింది. నిన్న పెళ్లికి వచ్చిన అతిథులంతా సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ఇవాళ రిసెప్షన్ అదిరిపోయేలా జరగుతోంది.. ఇవన్నీ బాంద్రాలోని జియో వరల్డ్ సెంటర్‌లోనే జరుగుతున్నాయి. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి చాలామంది ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశముంది.

లైవ్ వీడియో చూడండి..

ఇప్పటివరకు అనంత్-రాధిక వివాహానికి సంబంధించిన ప్రతి వేడుకలోనూ దేశ సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఏమాత్రం తగ్గకుండా ఘనంగా నిర్వహించింది అంబానీ కుటుంబం. ఏడు నెలలక్రితం మొదలైన వేడుకలు ఈనెల 14 తేదీతో ముగియనున్నాయి.