రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి విమాన సర్వీసు
రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ పురంధేశ్వరి వర్చువల్‌గా వీటిని ప్రారంభించారు. తొలి 35 మందికి రూ. 1999కే టికెట్ లభ్యం కానుంది. ఈ సర్వీసులు రాజమండ్రి అభివృద్ధికి దోహదపడతాయని నేతలు పేర్కొన్నారు.
రాజమండ్రి నుండి తిరుపతికి కొత్త విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దీని ద్వారా ప్రయాణ సమయం గంటల నుంచి నిమిషాలకు తగ్గింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్ నుండి ఎంపీ పురంధేశ్వరితో కలిసి వర్చువల్‌గా ఈ సర్వీసులను ప్రారంభించారు. రాజమండ్రి విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సహా పలువురు కూటమి నేతలు హాజరయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ డివైన్ మ్యూజిక్ సర్టిఫికేట్ కోర్స్
అరసవల్లిలో అద్భుత దృశ్యం.. మూల విరాట్టును తాకిన సూర్యకిరణాలు
అక్టోబర్ 1 నుంచి మారిన రూల్స్ ఇవే
