AP Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. డిసెంబర్ రెండోవ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించిన ధరఖాస్తులు స్వీకరించబోతోంది. ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించి అమలులో ఉన్న నిబంధనలలో మార్పులు చేర్పులు చేసి.. ఇతర సర్వీసులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించాలని భావిస్తోంది.
గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయకపోవడం.. మంజూరు చేసిన కార్డులకు కోతలు విధించడం.. నిబంధనలు సడలించకుండా కఠినంగా వ్యవహరించటంతో.. గత నాలుగేళ్లుగా అందరికీ కొత్త రేషన్ కార్డుల జారీకి అవకాశం లేకుండా పోయింది. ప్రతి ఆరు నెలలకు కొత్త రేషన్ కార్డులను గత ప్రభుత్వం మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా కూడా.. ఏదో ఒక సాకు చెప్పి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకుండా క్యాన్సిల్ చేసింది. ఈ నేపథ్యంలో అటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పథకాలకు లేదా గుర్తింపు కోసమో రేషన్ కార్డుల జారీలో వివక్ష చూపమని కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే లక్ష్యంగా పేదలందరినీ ఆదుకొని వారికి అండగా నిలిచేందుకే కూటమి ప్రభుత్వం ఉందని.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.