చెక్ పోస్టు వద్ద డబ్బాలు పెట్టి డ్రైవర్ల నుంచి నగదు వసూలు

Updated on: Oct 19, 2025 | 2:40 PM

తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది. కామారెడ్డిలోని సలాబత్‌పూర్ చెక్‌పోస్టు వద్ద డ్రైవర్ల నుంచి బాక్సులలో బహిరంగంగా డబ్బు వసూలు చేస్తున్న దృశ్యాలను అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో పలు జిల్లాల నుంచి లెక్కల్లో చూపని లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి, నారాయణపేట, సంగారెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఈ దాడులు జరిగాయి. కామారెడ్డి జిల్లాలోని సలాబత్‌పూర్ చెక్‌పోస్టు వద్ద ఏసీబీ అధికారులకు షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. అక్కడ చెక్‌పోస్టు సిబ్బంది డబ్బాలు పెట్టి వాహనదారుల నుంచి బహిరంగంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దేవాలయ హుండీ తరహాలో డ్రైవర్లు డబ్బాల్లో డబ్బులు వేసి వెళ్లడం గమనించిన ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Sweets: దేశంలోనే అత్యంత ఖరీదైన స్వీట్

నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్.. మాధురి పవర్ తీసేసిన నాగార్జున

TOP 9 ET News: దిమ్మతిరిగే న్యూస్.. పవన్‌ లోకేష్‌ కాంబినేషన్‌లో సినిమా..?

నిన్న దివ్య.. నేడు రీతూ.. ఒక్కొక్కరినీ ఉతికి ఆరేస్తున్న మాధురి! హౌసంతా హడల్‌

బంగారం కొంటున్నారా? నకిలీ గోల్డ్‌ని గుర్తించండిలా