సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు

Updated on: Nov 05, 2025 | 5:57 PM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలో 120 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, నరసరావుపేటలలో సోదాలు కొనసాగుతున్నాయి. లంచాల విషయంలో ఏజెంట్ల పాత్ర, నగదు స్వాధీనం, రికార్డుల పరిశీలనపై ఏసీబీ దృష్టి సారించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు 120 చోట్ల తనిఖీలు చేపట్టింది. విశాఖపట్నంలోని మధురవాడ, ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరులోని స్టోన్ హౌస్ పేట, పల్నాడు జిల్లా నరసరావుపేటతో సహా పలు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ కార్యాలయాల్లో ఏజెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్ల కోసం అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దాడుల సమయంలో పలుచోట్ల ఏజెంట్లు పరారయ్యారు. ఒంగోలులో ఓ వ్యక్తి కిటికీలోంచి రూ. 30,000 విసిరేయగా, ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులో సీనియర్ అసిస్టెంట్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రికార్డులు, నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ, అవినీతికి సంబంధించి లోతైన దర్యాప్తు చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kashmir Valley: మంచు కురిసే వేళలో.. కశ్మీర్ లోయ కనువిందు

Banks Holidays: నవంబరులో 12 రోజులు బ్యాంకులు బంద్‌

అదృష్టం తలుపు తట్టే లోపు.. దురదృష్టం ఆ తలుపులు పగలగొట్టేసింది

Viral Video: అది కాకి కాదు.. నా బిడ్డ.. చికిత్స చేయించిన యూసుఫ్‌

వెరైటీ దొంగ.. బంగారం, డబ్బు ఏదీ ఎత్తుకెళ్లడు కానీ