Bike Accident: యువకుడి ప్రాణం తీసిన కొత్త బైక్.. అదే అతడు చేసిన తప్పు..!

Updated on: Sep 11, 2023 | 11:01 AM

హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. కొత్త బండి సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కల్వాల గ్రామానికి చెందిన విఘ్నేష్‌ కొండాపూర్‌ శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసముంటున్నాడు. క్యాబ్‌ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న విఘ్నేష్‌తో పాటు మనీష్‌ అనే యువకుడు రూమ్ షేర్ చేసుకుంటున్నాడు. అయితే మనీష్ ఇటీవల కొత్తగా బైక్‌ కొన్నాడు.

హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. కొత్త బండి సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కల్వాల గ్రామానికి చెందిన విఘ్నేష్‌ కొండాపూర్‌ శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసముంటున్నాడు. క్యాబ్‌ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న విఘ్నేష్‌తో పాటు మనీష్‌ అనే యువకుడు రూమ్ షేర్ చేసుకుంటున్నాడు. అయితే మనీష్ ఇటీవల కొత్తగా బైక్‌ కొన్నాడు. దానికి రిజిస్ట్రేషన్‌ కాకపోవటంతో బయటకు తీయడం లేదు. ఆ బైక్ ఎలాగైనా నడపాలనేది విఘ్నేష్ సరదా. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మనీష్‌ నిద్రపోయాక.. అతనికి చెప్పకుండా విఘ్నేష్ బైక్ స్టార్ చేసి బయటకు వెళ్లాడు. ఓవర్ స్పీడ్‌తో వెళ్తుండగా.. కొండాపూర్‌ ఫ్లై ఓవర్ మీద ఒక్కసారిగా అదుపుతప్పాడు. రైట్ సైడ్ రెయిలింగ్‌ను ఢీకొట్టి ఎగిరి బొటానికల్‌ గార్డెన్‌ జంక్షన్‌లో కింద రోడ్డుపై పడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావటంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. తలకు హెల్మెట్ లేకుండా, ఓవర్ స్పీడ్‌తో వెళ్లటంతో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..