Viral: నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ..

|

Dec 01, 2024 | 1:41 PM

తిరుమల శ్రీనివాసుడికి నామాల స్వామి అని మరోపేరు. స్వామివారి లలాటంపై మెరిసే తిరునామం ఎంతో ప్రసిద్ధి చెందినంది. అలాంటి నామాల స్వామికే నామం పంగనామం పెట్టాలనుకున్నాడు ఓదొంగ. అవును, ఆపద మొక్కులవాడి చెంతకు వచ్చి ఆపద కొనితెచ్చుకున్నాడు. భక్తుల కోర్కెలు తీర్చే వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలో చోరీకి పాల్పడ్డాడు. నవంబర్ 23న శ్రీవారి ఆలయంలోని స్టీల్ హుండీలోని కొంత నగదును దొంగిలించాడు.

తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు శ్రీవారి దర్శనానికి వచ్చి పట్టపగలు మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్వామివారి హుండీలో కొంత నగదును చోరీచేసి అక్కడి నుంచి పరారయ్యాడు. చోరీకి సంబంధించిన దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఫుటేజీలను పరిశీలించి దొంగతనానికి పాల్పడిన యువకుడిని గుర్తించారు. యువకుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు అదే రోజు అరెస్ట్ చేశారు. భద్రతా సిబ్బంది తమ ఆఫీస్‌లో అతనిని విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. ఆ దొంగ నుంచి రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు భద్రతా సిబ్బంది తెలిపారు. చోరీకి పాల్పడిన యువకుడి పేరు వేణు లింగం అని పోలీసులు వెల్లడించారు. తమిళనాడులోని శంకరన్ కోవిల్‌కు చెందినవాడని వివరించారు. అనంతరం టీటీడీ అధికారులు అతడిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.