Loading video

అలర్ట్‌.. ఇకపై ఈ రైళ్లు కూడా చర్లపల్లి నుంచే..

|

Mar 17, 2025 | 6:27 PM

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే మరో నాలుగు రైళ్లనను చర్లపల్లి టెర్మినల్‌కు మార్చుతున్నట్టు మార్చి 11న దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటన చేసింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో రీడెవలప్‌మెంట్‌ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు, ఇటు రైల్వే స్టేషన్‌ రీ డెవలప్‌మెంట్ పనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మేరకు మార్పులు చేపట్టారు.

రూ.720 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధిని దశల వారీగా చేపడుతున్నామని వివరించింది. సికింద్రాబాద్‌నుంచి చర్లపల్లి టెర్మినల్‌కు మార్చిన రైళ్లలో తిరుపతి-ఆదిలాబాద్‌ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ చర్లపల్లి టెర్మినల్‌ నుంచి రాత్రి 8.10కి బయల్దేరుతుంది. బొల్లారం స్టేషన్‌లో రాత్రి 9.14కి ఆగుతుంది. ఆదిలాబాద్‌ నుంచి తిరుగు ప్రయాణంలో ఈ రైలు బొల్లారం స్టేషన్‌కు ఉదయం 4.29కి, చర్లపల్లికి 5.45కి వస్తుంది. మార్చి 26 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. కాకినాడ-లింగంపల్లి ప్రత్యేక రైలు ఉదయం చర్లపల్లి నుంచి 7.20కి బయల్దేరి, లింగంపల్లికి 9.15కి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు లింగంపల్లి నుంచి సాయంత్రం 6.30కి బయల్దేరి చర్లపల్లికి 7.30కి చేరుతుంది. ఈ మార్పు ఏప్రిల్‌ 2 నుంచి జులై 1 వరకు అమల్లో ఉంటుంది. కాజీపేట-హదాప్పర్‌ ఎక్స్‌ప్రెస్‌ చర్లపల్లికి రాత్రి 8.20కి వస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు చర్లపల్లికి తెల్లవారుజామున 3 గంటలకు వస్తుంది. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 22 నుంచి అమల్లోకి వస్తుంది. లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 7.15కి చర్లపల్లికి వస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు సాయంత్రం 6.05 గంటలకు చర్లపల్లి చేరుతుంది. ఈ మార్పు ఏప్రిల్‌ 25 నుంచి అమల్లోకి రానుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉరుములకు భయపడిన ఉడుత.. ఏం చేసిందంటే..

బెట్టింగ్‌ ఎఫెక్ట్! యూట్యూబర్‌ హర్షసాయికి బిగ్ షాక్

దారుణం! టాప్ 10 లిస్టులో ఒక్క తెలుగు సినిమా లేదా?

పవన్‌ కళ్యాణ్ పై బంగారం హీరోయిన్ క్రేజీ ట్వీట్

Anasuya: ఆంటీ అంటావా? దమ్ముంటే స్టేజ్‌పైకి రారా?