AP News: మీరు మారరా ఇక.. ఈ కేటుగాళ్ల స్కెచ్‌కి పోలీసులకే మైండ్ బ్లాంక్

|

Aug 24, 2024 | 7:16 PM

ఇక గంజాయి స్మగ్లర్లకు చుక్కలు కనపడనున్నాయ్. గంజాయి జోలికెళ్లినా, గంజాయి మరకపడ్డా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదవడమే కాక ఆస్తులు జప్తు చేస్తామంతున్నారు ఏజెన్సీ పోలీసులు. కొత్తగా వచ్చిన భారత న్యాయ్ సంహిత చట్టం ప్రకారం గంజాయి స్మగ్లింగ్..

ఇక గంజాయి స్మగ్లర్లకు చుక్కలు కనపడనున్నాయ్. గంజాయి జోలికెళ్లినా, గంజాయి మరకపడ్డా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదవడమే కాక ఆస్తులు జప్తు చేస్తామంతున్నారు ఏజెన్సీ పోలీసులు. కొత్తగా వచ్చిన భారత న్యాయ్ సంహిత చట్టం ప్రకారం గంజాయి స్మగ్లింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా పరిగణించబడుతుందని గంజాయి జోలికెళ్లినా, వాసననొచ్చినా జైలుకేనంటున్నారు ఏజెన్సీ పోలీసులు.

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ పరిధిలోని మోతుగూడెం అటవీ ప్రాంతంలో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు రూ. 17.60 లక్షల విలువైన 350 కేజీల గంజాయితో పాటు 100 గ్రాముల లిక్విడ్ గంజాయి పట్టుబడింది. ఈ మేరకు చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా మెడియా సమావేశంలో మాట్లాడారు. గత రాత్రి పక్కా సమాచారం తో వాహన తనిఖీలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఒడిశాలోని కూర్మనూరులో గంజాయి కొనుగోలు చేసి మోతుగూడెం అటవీ ప్రాంతంలో టీస్ 07 యూఏ 3969 నెంబరు గల వాహనంలో గంజాయి లోడ్ చేసి మహారాష్ట్ర‌లోని లాతూర్కు తరలిస్తుండగా వాహానాన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

అరెస్ట్ అయినవారిలో మహారాష్ట్రకు సయ్యద్ అన్సార్ అలీ, షేక్ యూనుస్ మూస్తాఫ్‌లు ఉన్నారని ఒడిసాకు చెందిన రెడ్డి, మహారాష్ట్రకు చెందిన సంతోష్‌లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 100 రోజుల గంజాయి నిర్మూలన యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జూన్ 1 నుండి ఇప్పటి వరకు 16 గంజాయి కేసుల్లో 43 మంది అరెస్ట్ అయినట్లు, మొత్తం 1670 కేజీల గంజాయితో పాటు 23 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. మరో 23 మంది పరారీలో ఉన్నట్లు వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు 24 గంటలు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు ఏఎస్పీ.

Published on: Aug 24, 2024 05:53 PM