Telangana: చేపల కోసం వల విసిరాడు.. కాసేపటికి బరువెక్కడంతో.. పైకి లాగి చూడగా

ఎప్పటిలాగే చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులకు అదృష్టం కలిసొచ్చింది. కడెం ప్రాజెక్టులో చేపల కోసం వలచేసిన జాలర్లకు వలలో భారీ కృష్ణబొచ్చచేప చిక్కింది. సాధారణంగా బొచ్చుచేపలు ఇంత భారీగా పెరగడం అరుదు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో జాలర్లకు భారీ బొచ్చ చేప చిక్కింది. సాధారణంగా బొచ్చ చేప ఇంత భారీగా పెరగడం అరుదు కాగా.. కడెం ప్రాజెక్టులో మత్స్యకారులకు చిక్కిన కృష్ణ బొచ్చ చేప సుమారు 22 కిలోలు ఉండటం గమనార్హం. ఇంత బరువున్న చేపలు ప్రాజెక్టులో అరుదుగా లభిస్తాయని స్థానిక మత్స్యకారుడు ముత్యాలు తెలిపాడు. కృష్ణ బొచ్చ చేప లభించడంతో చేపలు కొనుగోలు చేసేందుకు స్థానిక మార్కెట్‌కు వచ్చిన పలువురు ఆ చేపను పట్టుకొని ఫోటోలు దిగారు. ఈ చేపను మార్కెట్లో భారీ ధర పలికే ఛాన్స్ ఉందని మత్స్యకారుడు ఆనందంలో మునిగితేలుతున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియో చూసేయండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి