దొంగ వెంటపడి తరిమిన బాలిక.. పిల్ల కాదు పిడుగు వీడియో

Updated on: Oct 12, 2025 | 5:50 PM

మేడ్చల్ జిల్లా చింతల్‌లో 13 ఏళ్ల భవాని అనే బాలిక దొంగను ధైర్యంగా వెంబడించింది. ఇంట్లో చోరీకి యత్నిస్తున్న వ్యక్తిని చూసి ప్రశ్నించిన భవాని, దొంగ పారిపోతుంటే ప్రాణాలకు తెగించి వెంటపడింది. ఆమె సాహసం సీసీటీవీలో రికార్డు కాగా, పోలీసులు, స్థానికుల ప్రశంసలు అందుకుంది. భవాని ధైర్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

మేడ్చల్ జిల్లా చింతల్‌లోని భగత్ సింగ్ నగర్‌లో గురువారం మధ్యాహ్నం ఒక అసాధారణ సంఘటన జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. తాళం వేయని ఇంటి తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించిన దొంగ, విలువైన వస్తువులను మూటకడుతున్నాడు. అదే ఇంటి పైభాగంలో నివసిస్తున్న 13 ఏళ్ల భవాని అనే బాలిక అనుమానాస్పద శబ్దాలను గమనించి కిందకు వచ్చింది. దొంగను చూసిన భవాని, “ఎవరూ లేని ఇంట్లోకి వచ్చి ఏం చేస్తున్నావు?” అని ప్రశ్నించింది. దీంతో భయపడిన దొంగ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించాలని సంకల్పించిన భవాని, ప్రాణాలకు తెగించి అతన్ని వెంబడించింది. ధైర్యంగా కేకలు వేస్తూ వీధి చివర వరకు పరుగెత్తింది. స్థానికులు వచ్చేసరికి దొంగ తప్పించుకున్నప్పటికీ, ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం :

గర్ల్స్‌ టాయిలెట్‌లో హిడెన్‌ కెమెరా కలకలం వీడియో

రంగు డబ్బాతో పాఠశాలకు స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కు అవుతారు వీడియో

30 ఏళ్లనాటి ఆ కాగితాలే.. కోటీశ్వరుణ్ణి చేశాయి వీడియో