AP News: అరె.! ఎవర్రా మీరంతా.. ఖాకీలను చూడగానే కారు వదిలి పారిపోయారు.. సీన్ కట్ చేస్తే
అక్రమంగా రాష్ట్ర సరిహద్దును దాటిస్తోన్న 13 ఎర్ర చందనం దుంగలను శ్రీసత్యసాయి జిల్లా అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నల్లచెరువు మండలం పెద్ద ఎల్లంపల్లి సమీపంలో స్థానిక అటవీశాఖ అధికారులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో..
అక్రమంగా రాష్ట్ర సరిహద్దును దాటిస్తోన్న 13 ఎర్ర చందనం దుంగలను శ్రీసత్యసాయి జిల్లా అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నల్లచెరువు మండలం పెద్ద ఎల్లంపల్లి సమీపంలో స్థానిక అటవీశాఖ అధికారులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా కర్ణాటక నెంబర్ ప్లేట్‌తో ఉన్న ఆ కారు వచ్చింది. పోలీసులు చూసి కూడా ఆ వాహనం ఆగకుండా వెళ్లిపోవడంతో.. ఖాకీలు దాన్ని వెంబడించారు. కట్ చేస్తే.. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆ కారును అక్కడే వదిలేసి పారిపోయారు. ఇక నిందితులు వదిలేసి పరారైన కారులో 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు అటవీ శాఖ అధికారులు. కారుకు నకిలీ నెంబర్ ప్లేట్ పెట్టుకుని ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అనంతరం కారుతో పాటు దుంగలను కదిరికి తరలించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి కారు నెంబర్ల ఆధారంగా అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

