Telangana: SBI సిబ్బందిని పరిగెత్తించిన 12 ఏళ్ల కుర్రాడు.. కారణం తెలిస్తే మైండ్ బ్లాంక్

Updated on: Sep 12, 2025 | 8:12 PM

ఓ 12 ఏళ్ల కుర్రాడు.. మొత్తం ఎస్‌బీఐ బ్రాంచ్‌ను పరిగెత్తించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలు అతడు ఏం చేశాడో తెలుసా.? ఈ స్టోరీ చూస్తే మీకే అర్ధమవుతుంది. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా మరి.!

ఇప్పుడు మేము చెప్పబోయే స్టోరీ వింటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్ కౌంటర్ నుంచి ఐదు లక్షల నగదు చోరీ అయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పోలీసులు సైతం నివ్వెరపోయేలా చేసింది. ఓ 12 ఏళ్ల బాలుడు ఈ చోరీకి పాల్పడ్డాడు. సెప్టెంబర్ 8న ఈ ఘటన జరగ్గా.. ఎస్‌బీఐ బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాళ్లు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా.. బాలుడు చోరీ చేసినట్టు గుర్తించారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.