టెన్త్ పరీక్షల్లో మార్కులు కొట్టేయాలంటే
టెన్త్ పరీక్షలకు ఇంకా రెండు నెలలే ఉన్నాయా? ఫెయిల్ అవుతానని భయపడుతున్నారా? టెన్షన్ లేకుండా విజయం సాధించడానికి ప్రణాళిక అవలంబించండి. చివరి 5 సంవత్సరాల ప్రశ్నపత్రాలు, రివిజన్ క్లాసులు కీలకం. సందేహాలు నివృత్తి చేసుకుంటూ, మైండ్ మ్యాపింగ్ చేయండి. మానసిక ప్రశాంతత కోసం యోగా, పోషకాహారం ముఖ్యం. సమయపాలనతో చదివి, పక్కాగా రివైజ్ చేస్తే అధిక మార్కులు పక్కా.
టెన్త్ పరీక్షలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఫెయిల్ అవుతానేమో అనే భయం ఉన్నవారు ఓ ప్లాన్ ప్రకారం చదివితే ఏ మాత్రం టెన్షన్ లేకుండా లేకుండా ఎగ్జామ్ రాయొచ్చు. ఇందుకోసం సిలబస్ మొత్తం చదవాల్సిన పని లేదు. లాస్ట్ 5 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ బాగా చదివినా సరిపోతుంది. దాదాపు సిలబస్ అంతా వీటితోనే కవర్ అవుతుంది. ఇప్పటి నుంచైనా తప్పనిసరిగా రివిజన్ క్లాసులు శ్రద్ధగా వినాలి. వీటి ద్వారా కాన్సెప్ట్‌ని అర్థం చేసుకుని సులువుగా నేర్చుకోవడానికి వీలవుతుంది. డౌట్స్ ఉంటే టీచర్లను అడిగి క్లియర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ సాయంతోనూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. చదివింది మర్చిపోకుండా ఉండటానికి మైండ్ మ్యాపింగ్, కాన్సెప్ట్ లెర్నింగ్ తో ఉపయోగం ఉంటుంది. మెదడు అలసిపోతే రిలాక్స్ అవ్వాలి. పెద్ద టాపిక్‌లను చిన్న చిన్న పార్ట్‌లుగా చేసుకుని నేర్చుకోవచ్చు. పరీక్షలు రాసేటప్పుడు ముందు ప్రశ్నను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. రెండు సార్లు జాగ్రత్తగా చదివితే అందులో దేని గురించి అడిగారో తెలుస్తుంది. దీంతో సులువుగా సరైన సమాధానం రాయడానికి వీలవుతుంది. సమాధానం తెలిస్తే సరిపోదు. అర్థమయ్యేలా రాయడం ఎంతో ముఖ్యం. అందువల్ల బాగా రాయడాన్ని ప్రాక్టిస్ చేయాలి. ముఖ్యమైన పాయింట్లను హైలైట్ చేయాలి. ఇవన్నీ స్కోర్‌ను పెంచుతాయి. కొత్తగా నేర్చుకున్న ప్రశ్నలకు జవాబులు రాసి, మీరే సమీక్షించుకోండి. చేస్తోన్న చిన్నచిన్న పొరపాట్లు సరిదిద్దుకోండి. అలాగే ఎంత సమయంలో రాయగలుగుతున్నారో పరిశీలించండి. దీంతో అసలు పరీక్షలో టైమ్ మేనేజ్‌మెంట్‌తో ఇబ్బంది ఉండదు. పరీక్షలో విజయానికి మానసిక ప్రశాంతత ఎంతో ముఖ్యం. ఇందుకోసం యోగా, ప్రాణాయామం చేయాలి. ఏ విషయంలోనైనా ఆందోళనగా అనిపిస్తే టీచర్లు, తల్లిదండ్రులతో చర్చించాలి. అవకాశం ఉన్నవారు కౌన్సెలర్ల సహాయాన్ని తీసుకోవచ్చు. పరీక్షల వరకూ మొబైల్ పక్కన పెట్టేయడమే మంచిది. పోషకాహారం తీసుకుంటూ, సమయానికి నిద్ర పోవడమూ ముఖ్యం. బయటి ఆహారం తీసుకోవద్దు. ఆరోగ్య సమస్యలు లేకుండా చూసుకోవాలి. చివరిగా పబ్లిక్ పరీక్షల ముందు నేర్చుకున్నవన్నీ రివైజ్ చేయడం ఎంతో అవసరం. ఇందుకు షార్ట్ నోట్స్ ముందే తయారుచేసుకోవడం హెల్ప్ అవుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
120 వీధికుక్కలను పాతిపెట్టిన ఘటన.. 9 మందిపై కేసులు
AP High Court: సంక్రాంతి కోడిపందాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
Hyderabad : చైనా మాంజా తగిలి సాప్ట్‌వేర్ ఇంజనీర్ మెడకు గాయాలు
Sankranthi 2026 : తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరుస్తున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు
East Godavari : 2 లక్షల 50 వేల భోగిపిడకలు సిద్ధం చేసిన అక్కాచెల్లెళ్లు
