ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనూహ్య నిర్ణయం… ఇన్వెస్టర్ల రూ. 30,800 కోట్ల ‘లాక్ డౌన్’ !

అమెరికాలోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23 నుంచి ఇండియాలోని ఆరు ఫండ్లను నిలిపివేస్తున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లకు సంబంధించిన రూ. 30,800 కోట్లకు ‘లాక్’ పడినట్టే ! (స్తంభించినట్టే).. కరోనా వైరస్ కారణంగా తీవ్రమైన మార్కెట్ ఒడిదుడుకులు, లిక్విడిటీ నేపథ్యంలో తామీ నిర్ణయం తీసుకున్నట్టు ఈ సంస్థ తెలిపింది. కరోనా ప్రభావంతో అసలే ప్రపంచ వ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లు తీవ్రంగా సతమవుతున్న తరుణంలో ఈ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం […]

ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనూహ్య నిర్ణయం... ఇన్వెస్టర్ల రూ. 30,800 కోట్ల 'లాక్ డౌన్' !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 24, 2020 | 3:48 PM

అమెరికాలోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23 నుంచి ఇండియాలోని ఆరు ఫండ్లను నిలిపివేస్తున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లకు సంబంధించిన రూ. 30,800 కోట్లకు ‘లాక్’ పడినట్టే ! (స్తంభించినట్టే).. కరోనా వైరస్ కారణంగా తీవ్రమైన మార్కెట్ ఒడిదుడుకులు, లిక్విడిటీ నేపథ్యంలో తామీ నిర్ణయం తీసుకున్నట్టు ఈ సంస్థ తెలిపింది. కరోనా ప్రభావంతో అసలే ప్రపంచ వ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లు తీవ్రంగా సతమవుతున్న తరుణంలో ఈ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం ఇన్వెస్టర్లను భారీ షాక్ కి గురి చేసింది. ఫండ్లకు కవాటాలు మూసివేసిన ఫలితంగా పెట్టుబడిదారులు ఈ నెల 23 తరువాత నుంచి కొత్తగా కొనుగోళ్లు చేయలేరు. మరో విధంగా చెప్పాలంటే ఈ కటాఫ్ డేట్ అనంతరం ఎలాంటి ఆర్ధిక లావాదేవీలూ ప్రాసెస్ కాబోవు. ప్రస్తుత ఇన్వెస్టర్ల విషయంలో వీరి సొమ్ము మెచ్యురిటీ తీరేవరకు ఈ ఫండ్లలోనే ‘లాక్’ అయి ఉంటాయి.

బ్యాంకు డిపాజిట్లు, ఈజీ లిక్విడిటీతో పోల్చితే ఈ విధమైన ఫండ్లు ఎక్కువ రిటర్నులను అందజేస్తున్నందున తమ ‘హై ఇన్ కమ్ ఎసెట్ ఎలోకేషన్’ లో భాగంగా బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్, రిటైల్ ఇన్వెస్టర్లు సాధారణంగా డెట్ ఫండ్స్ లో పెట్టుబడి పెడతారు. ప్రస్తుతం మూసివేస్తున్న ఫండ్స్ లో ‘ఫ్రాంక్లిన్ ఇండియా లో (low) డ్యూరేషన్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అక్రూవల్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్ టర్మ్ ఇన్ కమ్ ప్లాన్, ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్ బాండ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్ కమ్ ఆపర్త్యునిటీస్ ఫండ్’ ఉన్నాయి.

ఫండ్ల నిలిపివేత వార్త దేశ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీకి చిక్కులు తెస్తాయని నిపుణులు భావిస్తున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఒక ముఖ్యమైన సంస్థ ఇలా డెట్ పథకాలను నిలిపివేయడం ఇదే మొట్ట మొదటిసారి. లాక్ డౌన్ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడంతో రుణ చెల్లింపులపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఫలితంగా ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగిపోయింది. డెట్ ఫండ్ పథకాల నుంచి తప్పుకోవడానికి వారు ప్రయత్నించారు. గత నెల ఏకంగా రూ. 1.94 లక్షల కోట్లు డెట్ ఫండ్ల నుంచి బయటికి వెళ్లాయి. ఈ మార్కెట్లలో లిక్విడిటీ కేపబిలిటీ పడిపోయిన దృష్ట్యా.. బాండ్ల అమ్మకాలు నిలిచిపోయాయి. రిజర్వ్ బ్యాంకు  లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ నిర్వహణ వంటి కీలక చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకొంది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో