అసోంలో ఒకే రోజు రెండు సార్లు భూ ప్రకంపనలు

ఈశాన్య భారతం మరోసారి భూ ప్రకంపనలతో వణికిపోయింది. ఇవాళ ఒక్కరోజే రెండు సార్లు భూమి కంపించిందని అధికారులు ప్రకటించారు. అసోం రాష్ట్రంలో సంభవించిన ప్రకంపనలు పొరుగున ఉన్న మేఘాలయ వరకు కనిపించిందని అధికారులు తెలిపారు. అయితే, ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు.

అసోంలో ఒకే రోజు రెండు సార్లు భూ ప్రకంపనలు
Earthquake
Follow us

|

Updated on: Jul 16, 2020 | 7:43 PM

ఈశాన్య భారతం మరోసారి భూ ప్రకంపనలతో వణికిపోయింది. ఇవాళ ఒక్కరోజే రెండు సార్లు భూమి కంపించిందని అధికారులు ప్రకటించారు. అసోం రాష్ట్రంలో సంభవించిన ప్రకంపనలు పొరుగున ఉన్న మేఘాలయ వరకు కనిపించిందని అధికారులు తెలిపారు. అయితే, ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. కరీంగంజ్‌ ప్రాంతంలో ఉదయం 7.57 గంటలకు రిక్టర్‌ సేలుపై 4.1 తీవ్రతతో నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెయిస్మాలజీ తెలిపింది. భూమికి 18 కిలోమీటర్ల దిగువన భూప్రకంపణ కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. దీని ప్రభావం మేఘాలయవ్యాప్తంగా కనిపించిందన్నారు. షిల్లాంగ్, పశ్చిమ గారో హిల్స్ ప్రాంతంలో బలమైన ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు.

రెండోసారి మధ్యాహ్నం 1.09గంటలకు భూమి కంపించిందని, పశ్చిమ అసోం కోక్రాజర్‌లో భూమికి 11 కిలోమీటర్ల దిగువన భూప్రకంపన కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రకంపన తీవ్రత 2.6గా నమోదైంది. దీని ప్రభావం పశ్చిమ మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిందని, వాటి వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా భూకంపాలు చోటు చేసుకుంటుండగా, గత నెలలో వరుస ప్రకంపనలు సంభవించాయి. ఇవి ఎక్కువగా మిజోరం రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. వరుస భూప్రకంపనలతో ఈశాన్య భారత ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు