వావ్.. ఆర్గానిక్ వాటర్ బాటిళ్లు.. అదిరిపోయే డిజైన్లతో..

సాదారణంగా వాటర్‌ బాటిళ్లు ప్లాస్టిక్‌తో తయారు చేసినవే ఎక్కువగా మార్కెట్లో ఉంటాయి. ఎందుకంటే ఇవి తక్కువ ధరకు లభిస్తాయి. ఇక కాపర్‌తో తయారు చేసిన వాటర్‌ బాటిళ్లను కూడా ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు. కానీ అవి..

వావ్.. ఆర్గానిక్ వాటర్ బాటిళ్లు.. అదిరిపోయే డిజైన్లతో..
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2020 | 5:33 AM

సాదారణంగా వాటర్‌ బాటిళ్లు ప్లాస్టిక్‌తో తయారు చేసినవే ఎక్కువగా మార్కెట్లో ఉంటాయి. ఎందుకంటే ఇవి తక్కువ ధరకు లభిస్తాయి. ఇక కాపర్‌తో తయారు చేసిన వాటర్‌ బాటిళ్లను కూడా ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు. కానీ అవి కాస్త ధర ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మధ్య ప్లాస్టిక్‌ వాడకం తగ్గించేందుకు అంతా ప్రత్యామ్నాయాల వైపు దృష్టిపెడుతున్నారు. ఇదే సమయంలో త్రిపురకు చెందిన బ్యాంబూ అండ్ క్రాఫ్ట్స్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్ ఆర్గానికి వాటర్ బాటిళ్లను తయారు చేసింది. వీటిని వెదురు కట్టెలతో తయారు చేస్తున్నారు. అగర్తలలోని స్థానికులు వెదురుతో ఈ వాటర్‌ బాటిళ్లను తయారు చేసి.. ప్రత్యేక ఆకర్షణగా ఉండేందుకు బాటిల్‌ బయట డిజైన్లను కూడా వేస్తున్నారు. ఈ విషయాన్ని బ్యాంబూ అండ్ క్రాఫ్ట్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్ ఇంఛార్జ్ అవినభ్ కాంత్ తెలిపారు. ప్రస్తుతం ఈ వెదురుతో తయారు చేసిన వాటర్‌ బాటిళ్లకు భలే గిరాకీ ఉందని.. కస్టమర్లు వీటిని కొనేందుకు మక్కువ చూపుతున్నారన్నారు. ఇవి పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ బాటిళ్లని తెలిపారు. అంతేకాదు.. వీటిని పూర్తిగా ఆర్గానిక్‌ పద్దతిలోనే రెడీ చేస్తున్నామని తెలిపారు.

Tripura: Considering the rising demand for hand-crafted products, Tripura Rehabilitation Plantation Corporation (TRPC) has started production of water bottles using bamboo in Bamutia. Prasant Rao, MD at TRPC says, “Process of manufacturing is completely organic.” pic.twitter.com/x1Pejnd1DO

— ANI (@ANI) July 15, 2020

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో