Viral Video: స్విగ్గీ, జోమాటో డెలివరీ బాయ్స్ సంపాదన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువా? వైరల్‌గా మారిన యూట్యూబర్ ఇంటర్వ్యూ

|

Jul 22, 2024 | 7:09 PM

ఐటీ కంపెనీల్లో పనిచేసే ఇంజనీర్లు ఎక్కువ సంపాదిస్తారనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. అవును కొంతమంది ఇంజనీర్ల జీతం ఖచ్చితంగా లక్షల్లో ఉంటుంది. కొందరికి ప్యాకేజీలు కూడా కోట్లలో ఉంటాయి.. అయితే అదే సమయంలో చాలా మంది ఇంజనీర్లు యావరేజ్ గానే సంపాదిస్తారు. ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీల్లో పనిచేసే డెలివరీ బాయ్స్ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని తేలింది.

Viral Video: స్విగ్గీ, జోమాటో డెలివరీ బాయ్స్ సంపాదన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువా? వైరల్‌గా మారిన యూట్యూబర్ ఇంటర్వ్యూ
Viral News
Follow us on

బాగా డబ్బులు సంపాదించాలంటే ఖచ్చితంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగం చేయాలని నేటి జనరేషన్ తో పాటు తల్లిదండ్రుల నమ్మకం. అందుకనే ఎక్కువ మంది సాఫ్ట్ వేరు కంపెనీలో ఉద్యోగం కోసం చదువులు చదువుతున్నారు. రకరకాల కోచింగ్స్ తీసుకుంటూ కష్టపడుతున్నారు. ఎందుకంటే అంతగా ఐటీ కంపెనీల్లో పనిచేసే ఇంజనీర్లు ఎక్కువ సంపాదిస్తారనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. అవును కొంతమంది ఇంజనీర్ల జీతం ఖచ్చితంగా లక్షల్లో ఉంటుంది. కొందరికి ప్యాకేజీలు కూడా కోట్లలో ఉంటాయి.. అయితే అదే సమయంలో చాలా మంది ఇంజనీర్లు యావరేజ్ గానే సంపాదిస్తారు. ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీల్లో పనిచేసే డెలివరీ బాయ్స్ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని తేలింది.

వాస్తవానికి ఫుల్ డిస్‌క్లోజర్ ఛానెల్‌కు చెందిన ఒక మహిళా యూట్యూబర్ Zomato , Swiggy కంపెనీల డెలివరీ ఏజెంట్‌లను ఇంటర్వ్యూ చేసింది, ఇందులో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. డెలివరీ ఏజెంట్ల చెప్పిన ప్రకారం వారు ప్రతి నెలా రూ. 40-50 వేలు సంపాదిస్తున్నారు. ఈ జీతం ఐటీ ఉద్యోగుల సగటు నెలవారీ ఆదాయం కంటే ఎక్కువ. కేవలం 6 నెలల్లో రూ.2 లక్షలు ఆదా చేశానని డెలివరీ ఉద్యోగి చెప్పాడు.

ఈ వీడియో వైరల్ అవుతోంది

ఇవి కూడా చదవండి

జొమాటో డెలివరీ ఏజెంట్ మాట్లాడుతూ.. తాను ఫుడ్ డెలివరీ చేసి రోజూ రూ. 1500-2000 సంపాదిస్తున్నానని చెప్పాడు. వారపు సంపాదన దాదాపు రూ. 10,000-12,000. నేను నెలకు దాదాపు రూ. 40,000-50,000 సంపాదిస్తున్నానని చెప్పాడు. అదే సమయంలో డెలివరీ సమయంలో టిప్స్ కూడా వస్తాయి. ఈ టిప్స్ ప్రతి నెల రూ. 5,000 వరకు ఉంటుంది. కిలోమీటరుకు రూ.10 ఇస్తారు. ఇక ఫుడ్ డెలివరీ సమయంలో వర్షం పడితే ఎక్కువ సంపాదిస్తున్నాం అని చెప్పాడు. అంతేకాదు తాను సంపాదించిన డబ్బులను సేవ్ చేస్తున్నట్లు వెల్లడించాడు. ప్రతి నెల దాదాపు రూ.30 వేలు పొదుపు చేస్తున్నానని చెప్పాడు. ఇప్పటికే 6 నెలల్లో రూ.2 లక్షలు ఆదా చేశాను. ఈ డబ్బుతో నేను మా గ్రామంలో వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నానని తన కోరికను తెలిపాడు ఆ డెలివరీ బాయ్.

ఈ వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాల కామెంట్స్ ను చేశారు. ఒకరు ‘నేను డెలివరీ ఏజెంట్ గా కూడా పనిచేశాను అయితే రూ. 40 వేలు సంపాదించడం అంత సులభం కాదు. రోజుకు 12 గంటల కంటే ఎక్కువ పని చేయాలి’ అని మరొకరు కామెంట్ చేశారు. ‘డెలివరీ బాయ్‌లు కూడా ఇంత డబ్బు సంపాదిస్తారని నాకు తెలియదు. ఇప్పుడు బైక్ కూడా కొంటానని ఒకరు చెప్పగా.. మరొకరు ఈ వీడియో ముగింపు మనకు నచ్చిన పనుల చేయడం కోసం కొన్నిసార్లు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉందని తనకు అర్థమైంది’ అని వెల్లడించారు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..