Watch: అయ్యో పాపం జీబ్రా.. అనుకోకుండా మొసళ్ల గుంపుకు చిక్కింది.. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించలేరు..?

సోషల్ మీడియా యుగంలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు వైరల్‌ అవుతున్నాయి..మనకు తెలియని జంతువులు, ఇతర జీవుల ప్రపంచం, వాటి జీవన విధానాలను కూడా మనం సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉంటాం..అందులో అడవి జంతువుల వేట, వేటగాడి నుంచి తప్పించుకునే ప్రయత్నాల వంటి ఎన్నో దృశ్యాలు మనకు కనిపిస్తాయి. అలాంటి షాకింగ్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ఖాతాతో షేర్ చేయబడింది. ఇటువంటి వీడియోలు తరచుగా ఈ పేజీ ద్వారా షేర్‌ అవుతుంటాయి.

Watch: అయ్యో పాపం జీబ్రా.. అనుకోకుండా మొసళ్ల గుంపుకు చిక్కింది.. ఆ తర్వాత ఏం జరిగిందో ఊహించలేరు..?
Zebra

Edited By: TV9 Telugu

Updated on: Jan 17, 2025 | 8:00 PM

ప్రకృతి ఎల్లప్పుడూ దాని అద్భుతాలతో మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల వైరల్ అయిన వీడియో కూడా మరోసారి దీనిని నిరూపించింది. సాధారణంగా, మొసలి, జీబ్రా మధ్య వివాదం వచ్చినప్పుడు, చాలా మంది మొసలి గెలుస్తుందని భావిస్తారు. కానీ, @AMAZlNGNATURE అనే ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఈ వీడియో అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఇప్పటివరకు 15 మిలియన్లకు పైగా వీక్షించబడిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో అతి తక్కువ సమయంలో సంచలనంగా మారింది. జీబ్రా ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ ప్రజలు స్పందించారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక జీబ్రా చుట్టూ చాలా మొసళ్లు చుట్టు ముట్టాయి.. జీబ్రాను ఎలాగైనా పట్టుకోవాలని మొసలి ప్రయత్నిస్తోంది. ఒక మొసలి జీబ్రా తలను నోటిలో పెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ, అంతలోనే ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. జీబ్రా మొసలి తలను నోటిలో పెట్టుకుంటుంది. అనంతలోనే జీబ్రాపై దాడి చేసేందుకు ఇతర మొసళ్లు కూడా వస్తాయి. కానీ, జీబ్రా ఈ మొసళ్ల నుండి తప్పించుకోవడానికి తన శక్తినంతా ఉపయోగించి చివరకు ఒడ్డుకు చేరుకుంటుంది. ఒళ్లు గగ్గుర్పొడిచే ఈ వీడియో ఇంటర్‌ నెట్‌లో వేగంగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను 15 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. జీబ్రా ధైర్యసాహసాలు మెచ్చుకోవాల్సిన అవసరం ఉందని, దాని ప్రాణాలను కాపాడుకోవడానికి అది చేసిన పోరాటం ప్రశంసనీయం అని పలువురు పేర్కొన్నారు. అదే సమయంలో, నీటిలో హిప్పోపొటామస్ కూడా ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..