ఇంటర్నెట్‌లో మంచి కంటే చెడే ఎక్కువగా వైరల్ అవుతుంది. వెబ్ కనెక్షన్, ప్రతీ ఒక్కరి చేతుల్లో మొబైల్.. అంతే! యువత పోర్న్ కంటెంట్‌కు బానిసవుతున్నారు. పోర్న్ చూడటం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. మన ప్రవర్తనపై కూడా ఇది తీవ్రమైన ప్రభావితం చూపుతుంది. ఇదే కోవలో ఓ యువకుడు కూడా పోర్న్ వీడియోలకు బానిసై.. తన కామ కోరికలు తీర్చుకునేందుకు చేయకూడని పని చేశాడు. చివరికి ఆసుపత్రి పాలయ్యాడు. ఇంతకీ అసలేం జరిగింది ఇప్పుడు తెలుసుకుందామా..
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని జలాల్‌పూర్ ప్రాంతంలో నివసిస్తున్న 28 ఏళ్ల యువకుడు జూన్ 2న తన ఇంటిలో పోర్న్ వీడియో చూస్తూ.. విపరీతమైన భావప్రాప్తిని పొందాలని భావించాడు. అనుకున్నదే తడువుగా తన ప్రైవేటు పార్ట్‌లో ప్లాస్టిక్ బాటిల్‌ని జొప్పించాడు. అంతే! ఆ బాటిల్ రంధ్రంలోకి యువకుడి అంగం ఇరుక్కుపోయింది. ఆ తర్వాత దాన్ని తీయాలనుకున్నా.. ఎంతకు కుదరదు. ఒక రోజు మొత్తం బాటిల్ తీసేందుకు సదరు యువకుడు ప్రయత్నిస్తాడు. చివరికి ప్రైవేటు పార్ట్‌లో విపరీతమైన నొప్పి రావడంతో.. చేసేదేమి లేక స్థానిక నవ్‌సారిలోని సివిల్ ఆస్పత్రికి వెళ్తాడు. అక్కడున్న డాక్టర్లకు తన పరిస్థితిని వివరిస్తాడు. ఆ తర్వాత ఐదుగురు డాక్టర్ల బృందం 1 గంట పాటు కష్టపడి.. శస్త్రచికిత్స ద్వారా అతడి జననాంగాల్లో ఇరుక్కున్న ప్లాస్టిక్ బాటిల్‌ను బయటికి తీశారు. అనంతరం సదరు యువకుడిని సైకాలిజిస్ట్ పరీక్షించగా.. అతడికేవి మానసిక రుగ్మతులు లేవని.. కేవలం పోర్న్ వీడియోలు చూడటం వల్లే.. ఇలా ప్రభావితమయ్యాడని చెప్పుకొచ్చారు.