ఇటీవల చాలా మంది ప్రజల్లో రీల్స్, పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది. సోషల్ మీడియాలో షేర్లు, లైకుల కోసం ప్రమాదకరంగా రీల్స్ చేస్తూ.. ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా, ఓ యువకుడు ఏకంగా చిరుతపులితో సెల్ఫీకి ప్రయత్నించాడు. చిరుతను చూడాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ దాని పక్కన నిల్చుని ఫోటో దిగాలనుకుంటే మాత్రం దబిడిదిబిడే. సేమ్ మైసూరులో ఇదే జరిగింది. బోనులో ఉంది కదా అని సెల్ఫీ దిగేందుకు ట్రై చేశాడో యువకుడు. ఇంకేముందీ..పంజా విసరనే విసిరింది. బోనులో ఉన్నా..బయట ఉన్నా..చిరుత చిరుతేనని నిరూపించింది.
ఇలా సెల్ఫీ పిచ్చిలో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా మైసూర్‌లో ఓ యువకుడు ఏకంగా చిరుత పులితో సెల్ఫీ దిగబోయాడు. బోనులో ఉందని..ఏం చేస్తుందిలే అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే…సెల్ఫీకి ట్రై చేసిన యువకుడిపై పంజా విరిసింది చిరుత. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది.
ఇటీవల అడవి నుంచి తప్పించుకుని ఓ చిరుత గ్రామాలపై పడింది. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వేట ప్రారంభించారు. చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బోనులో బంధించారు. బోనులో చిరుతను తరలిస్తుండగా..ఓ యువకుడు సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ఫోటో తీసుకుంటుండగా..బోను ఊచల మధ్య నుంచి పంజా విసిరింది. అక్కడున్నవారు పక్కకు లాగేయడంతో ప్రాణాపాయం తప్పింది. చిరుత దాడిలో ఆ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.
సెల్ఫీ తీసుకుంటుండగా ఆ యువకుడికి చిరుత ఇచ్చిపడేసింది. ఒక్కసారిగా పంజా విసిరి దాడిచేసింది. అక్కడున్నవారు పక్కకు లాగేయడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడ్డ బాధితుడిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. యువకుడికి ప్రాణాపాయం తప్పినట్టు డాక్టర్స్ చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..