ప్రతిరోజూ నెట్టింట్లో ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వీటిలో చాలా వీడియోలు తెగ వైరలవుతుంటాయి. ఇలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తుంది. పెళ్లిల్లో జరిగే అన్ని తంతు విషయాలు సోషల్ మీడియాలో వీడియోల రూపంలో తెగ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఇక బరాత్‌లో డ్యాన్సులు, మండపం వద్ద చిందుల విషయానికి వస్తే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మిథున్ చక్రవర్తి చిత్రం డిస్కో డాన్సర్‌లోని జిమ్ జిమ్మీ పాటకు ఓ వ్యక్తి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి జిమ్మీ జిమ్మీ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఆ వ్యక్తి డ్యాన్స్ స్టెప్పులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రజలు జిమ్మీ జిమ్మీ పాటలో అతని డ్యాన్స్‌ని మళ్లీ మళ్లీ చూసేందుకు చాలా ఇష్టపడుతున్నారు.
రోహిత్ విశ్వాస్ అనే వినియోగదారుడు ఈ డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇందులో ఓ వివాహం సందర్భంగా మిథున్ చక్రవతి సినిమా డిస్కో డాన్సర్ పాటకు ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్నాడు. జిమ్మీ జిమ్మీ పాటలో వ్యక్తి డ్యాన్స్ బాగానే ఉంది. అక్కడ ఉన్న జనం కూడా ఆ డ్యాన్స్‌ని ఎంజాయ్ చేస్తూ వీడియోలు తీస్తూ కనిపించారు.
అయితే, ఈ వీడియో ఎప్పటిదనే విషయం గురించి యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈయనకు సంబంధించిన ఈ వీడియోని జనాలు బాగా ఇష్టపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..