
ప్రపంచంలో ఉన్న ఒక్కో వ్యక్తి స్వభావం ఒక్కో విధంగా ఉంటుంది. కొందరు ఎంతో చలాకీగా ఉండగా.. మరికొందరు మాత్రం ఎప్పుడూ చూసిన ముడీగా ఉంటారు. మరికొందరు వాక్చాతుర్యంతో ఎక్కువగా ఉంటుంది.. అలాగే నిశ్శబ్దంగా ఉండేవారున్నారు. అయితే సాధారణంగా మనం ఓ ఫోటోను చూసే విధానం మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. దానిని ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు. ఆప్టికల్ భ్రమలు.. వ్యక్తిత్వాన్ని.. స్వభావాన్ని తెలియజేస్తాయి. ప్రస్తుతం ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది. అందులో మీరు ఏదైతే ముందుగా చూస్తారో అదే మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మరీ అదెలాగో తెలుసుకుందామా.
చూశారు కదా.. పైన ఫోటోను చూడగానే ముందుగ మీరు ఏం గమనించారు.. మొట్ట మొదట మీరేం గమనించారు.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందామా.
ముందుగా మీరు రూస్టర్ ను చూసినట్లయితే మీరు చాలా సిగ్గుపడుతున్నారని అర్థం. మీరు మానసికంగా మెరుగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఏదాని మీదనైనా శ్రద్ధ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు.
ఒకవేళ జత పెదాలను చూసిన వ్యక్తులు భిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.
అలాగే మీరు ముందుగా నోటిని చూస్తే.. ఎప్పుడు నమ్మకంగా.. బలంగా స్వతంత్రంగా ఉంటారని అర్థం..కానీ కొన్ని సందర్భాల్లో అది మీకు సమస్యగా మారుతుంది. మీకు కావాల్సిన విషయాలు జరగనప్పుడు కాస్త మొండిగా.. దూకుడుగా ప్రవర్తిస్తారు. అయితే ఈ వ్యక్తిత్వ లక్షణాలు తమకు సరిగ్గా సరిపోయాయని కొందరు వీక్షకులు తెలియజేశారని టిక్ టాక్ స్టార్ చార్లెస్ మెరియట్ చెప్పారు.
గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల అభిప్రాయాలు.. పాఠకుల ఆసక్తిని బట్టి మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించలేదు.
Also Read: Acharya: సిద్ధ పాత్రకు ముందుగా మహేష్ బాబును అనుకున్నారా ?.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్..
Acharya First Review: ఆచార్య ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందో చెప్పేసిన ఉమైర్ సంధు..