రోజు రోజుకీ వింత వింత వంటకాల వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే కొన్ని రకాల ప్రయోగాలు భోజన ప్రియులను ఆకర్షిస్తూ తినాలి అనిపించేలా ఉంటాయి. తాము కూడా ఆ వీడియోలో కన్పిస్తున్న వంటలను ప్రయోగాలను చేయాలని భావిస్తారు. అయితే కొన్ని రకాల వంటల ప్రయోగాలు మాత్రం వద్దు బాబోయ్.. ఇలాంటి వంటలను మళ్ళీ జన్మలో చూడవద్దు అనిపించేలా ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వంటలకు సంబంధించిన వీడియోలో దోసను చూస్తే .. దేవుడా ఇదేమి దోస.. మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి వంటకం నా కంట పడేలా చేయవద్దు.. ఇలాంటి వంటలు చేసే వారికీ దండ వేసి దణ్ణం పెట్టాలి అని అనుకుంటారు.. మరి ఆ దోస ఏమిటో తెలుసా..
వేసవి వస్తే చాలు.. అందరి మదిలో మామిడి పండు మెదులుతుంది. రకరకాల రుచికరమైన ఆహారపదార్ధాలను తయారు చేసుకుని ఎంతో ఇష్టంగా తింటారు. మామిడి షరబత్, కూరలు, పచ్చళ్ళు వంటి భిన్నమైన పదార్ధాలను తయారు చేస్తారు మామిడి కాయలు, పండ్లతో అన్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక దోస ఆమ్రాస్ దోస అనే విచిత్రమైన ఆహార పదార్ధం.. దీనిని చూసిన తర్వాత ఎప్పుడు మామిడి సీజన్ త్వరగా వెళ్లిపోతుందా అని అని అనుకోని వారుండరు అంటే అతిశయోక్తి కాదు.. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ ను అమ్ముతున్న ఒక యువకుడు మామిడి దోసను తేదీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది..
It mango season then how can we miss this .
Please try it once on your own Risk . ???
Aamras Dosa ! !!
Goodnight . @queenlioness86 @Dival1000 @Rj80814657 @Sandeep49157861 @RajKevalya @IamGMishra .
Anyone missing please tag . And retweet ro maximum . pic.twitter.com/RumSVLe3Ow
— Pratik Shah ( Social Musketeer)?♂️ (@SpringIndia) April 4, 2023
వీడియోలో.. ముందుగా పాన్ పెట్టి.. వేడి ఎక్కిన తర్వాత దోసె పిండిని వేసి దోసగా చుట్టాడు.. అనంతరం.. దానిమీద వెన్నను వేసి.. మామిడి పండు జ్యుస్ వేసి.. దోశ మీద అప్లై చేశాడు.. కొన్ని సెకన్ల తర్వాత దోసమీద పన్నీర్ ను ట్యాపింగ్ చేసి.. కొన్ని సెకన్ల అనంతరం.. దోసను నిలువుగా కట్ చేసి ఒక ప్లేట్ లో పెట్టాడు. అనంతరం.. ఒక కప్పులో మామిడి పండు జ్యుస్ ని చట్నిగా పెట్టి.. ఆహార ప్రియులకు అందించాడు.
వైరల్‌గా మారిన వీడియోలోని మామిడి పండు జ్యుస్ వంటకాన్ని భోజనప్రియులు ప్రయత్నించడం చూడవచ్చు అని పేర్కొన్నారు. ముంబైలోని ఘట్‌కోపర్ ప్రాంతంలో ఉన్న ఈ దోసను సాయి స్వాద్ దోసాగా గుర్తించారు.
ఈ వీడియోను @SpringIndia ట్విట్టర్‌లో షేర్ చేశారు. వేలాది మంచి వీక్షించారు. ఈ విచిత్రమైన దోసను ఫన్నీగా తీసుకున్నారు. ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అంటూ కామెంట్లా చేస్తున్నారు. విచిత్రమైన ఆహారాన్ని చూసి నవ్వుతున్నారు. ఎవరైనా దీన్ని ఎలా తినగలరని ఆశ్చర్యపోతున్నారు.. ఫన్నీ మీమ్‌లతో వీడియో నిండిపోయింది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..