Viral News: ప్రపంచంలోనే అత్యంత దురదృష్టకర పాట.. 62 ఏళ్లు నిషేధం.. పాటలో ఏముందంటే

64 కళల్లో ఒకటి సంగీతం.. దీనికి విశేషమైన ప్రాముఖ్యత ఆంది. అందుకనే మన పెద్దలు శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః అని చెప్పారు. అంటే మనసుకి హాయినిచ్చి.. చెవులకు ఇంపుగా సాగిపోయే పాటలు వింటే శిశువులు , పశువులు , పాములే కాదు ప్రేక్షకులు కూడా వశం అవుతారు. అయితే ప్రపంచంలో వందలాది మంది ప్రాణాలను తీసిన అత్యంత దురదృష్టకరమైన పాట ఒకటి ఉందని తెలుసా..! ఈ పాటని దాదాపు 62 ఏళ్లు బ్యాన్ చేశారు. ఎందుకంటే..

Viral News: ప్రపంచంలోనే అత్యంత దురదృష్టకర పాట.. 62 ఏళ్లు నిషేధం.. పాటలో ఏముందంటే
World's Most Cursed Song

Updated on: Sep 03, 2025 | 3:51 PM

మనఃస్థితిని నియంత్రించడానికి సంగీతం ఒక గొప్ప మార్గం. పాటలను విండడం జీవితాన్ని ఉత్తమంగా చేస్తుంది. అందుకనే పాటలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఇక సినిమాల్లో పాటలు లేకుండా చిత్రీకరించడం అంటే అరుదు అని చెప్పవచ్చు. కొన్ని సినిమాలు సంగీతం, పాటలతో సూపర్ హిట్ అయ్యాయి. ఆనందంలోను, దుఃఖంలోను ఎటువంటి సందర్భంలోనా రకరకాల పాటలు వినడం చాలా మందికి అలవాటు. అంతగా పాటలు మనుషుల జీవితంలో కలిసి పోయాయి. మనసుకు తగిలిన గాయాన్ని తగ్గించి కొత్త శక్తిని ఇచ్చే పాటలు అనేకం ఉన్నాయి. అయితే కొన్ని పాటలు మనసుకు విషాదాన్ని కలిగిస్తాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత దురదృష్టకరమైన పాట ఒకటి ఉందని మీకు తెలుసా.. ఈ పాట 100 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. దీంతో ఈ పాటని దాదాపు 62ఏళ్లపాటు బ్యాన్ చేశారు.

ప్రపంచంలోనే అత్యంత దురదృష్టకర పాట

ఈ పాటని విన్న తర్వాత ప్రజలు ఆత్మహత్య చేసుకునేవారు. హౌస్ స్టఫ్ వర్క్ వెబ్‌సైట్ ప్రకారం.. గ్లూమీ సండే పాట (GLOOMY SUNDAY Song) ప్రపంచంలోనే అత్యంత దురదృష్టకరమైన పాట. ఈ పాటను హంగేరీ కి చెందిన రెజ్సో సెరెస్ రాశారు. ఈ పాటను ఆయన రాసినప్పుడు చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. 1933లో రాసిన ఈ పాట 1935లో విడుదలైంది. అదే సంవత్సరంలో ఒక వ్యక్తి దీనిని విన్న తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వ్యక్తి తన సూసైడ్ నోట్‌లో ఈ పాటను గురించి ప్రస్తావించాడు. అదే సమయంలో ఈ పాట స్వరకర్తకు కాబోయే భార్య కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతారు. తర్వాత అప్పుల బాధతో ఉన్న పాట రచయిత రెజ్సో కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇద్దరు వ్యక్తులు తమను తాము కాల్చుకుని, ఒక మహిళ పాట విన్న తర్వాత నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా జరిగిన తర్వాత, ఈ పాటను నిషేధించారు.

పాటలో ఏముంది?

ఈ పాట హంగేరియన్ పాట. ఈ పాట విడుదలైన సమయంలో.. హంగేరిలో చాలా మంది ప్రజలు ఒత్తిడితో పోరాడుతున్నారు. ప్రజలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ పాటలోని సాహిత్యం, చిత్రీకరణ ఎవరి జీవితానికి అన్వయించుకున్నా తమదే అని భావించడం మొదలు పెట్టారు. ఈ పాట వారిని మరింత విచారానికి గురించేయడం మొదలు పెట్టింది. ఈ పాట సాహిత్యం మానవత్వం, జీవితంలోని హడావిడి, మనిషి జీవితంలో దుఃఖాలు, మరణం గురించి ఉంటుంది. ఇలా చాలా మంది ఆత్మహత్య చేసుకుని చనిపోవడం వలన ఈ పాటను 62 సంవత్సరాలు బ్యాన్ చేశారు. చివరికి 2003లో ఈ పాట మీద ఉన్న బ్యాన్ ని ఎత్తివేశారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..