AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఈ ఐస్‌క్రీమ్ బంగారం కన్నా కాస్ట్లీ గురూ.. టేస్ట్ చేయాలంటే ఆస్తులు అమ్మాల్సిందే.. అంత స్పెషలేంటంటే?

Byakuya ICE Cream Japan: ఆహార ప్రియులకు ఇదొక అద్భుతమైన వింతైనప్పటికీ, ఒక ఐస్‌క్రీమ్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయడం అనేది కేవలం కోటీశ్వరులకే సాధ్యమయ్యే విలాసం. ఏదేమైనా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఐస్‌క్రీమ్ రుచి ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలం మాత్రం ప్రతి ఒక్కరిలోనూ కలగడం సహజం.

Video: ఈ ఐస్‌క్రీమ్ బంగారం కన్నా కాస్ట్లీ గురూ.. టేస్ట్ చేయాలంటే ఆస్తులు అమ్మాల్సిందే.. అంత స్పెషలేంటంటే?
Byakuya Ice Cream Japan
Venkata Chari
|

Updated on: Jun 07, 2026 | 12:34 PM

Share

Most Expensive ICE Cream: వేసవి కాలంలో చల్ల చల్లని ఐస్‌క్రీమ్ తింటుంటే ఆ మజానే వేరు. చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు ఐస్‌క్రీమ్ పేరు చెబితేనే నోరూరుతుంది. సాధారణంగా ఐస్‌క్రీమ్ కప్పు ధర యాభై రూపాలో, వందో లేక మహా అయితే వెయ్యి రూపాలో ఉంటుంది. కానీ, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఒక ఐస్‌క్రీమ్ స్కూప్ ధర అక్షరాలా రూ. 5.5 లక్షలు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.

ప్రపంచ రికార్డు సృష్టించిన జపాన్ ‘బ్యాకుయా’..

జపాన్‌కు చెందిన ఒక ప్రముఖ సంస్థ ఈ అరుదైన ఐస్‌క్రీమ్‌ను తయారు చేసింది. దీనికి ‘బ్యాకుయా’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా ఇది గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. సామాన్యుడు తన జీవితకాలంలో సంపాదించే మొత్తాన్ని ఈ ఐస్‌క్రీమ్ ఒకే ఒక్క స్కూప్ కోసం ఖర్చు చేయాల్సి వస్తుందంటే దీని క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఐస్‌క్రీమ్‌లో అంతలా ఏముంది? ఎందుకు దీనికి అంత ధర? అనే కదా మీ సందేహం!

ఇటలీ వైట్ ట్రఫుల్స్.. కేజీ రూ. 12 లక్షలు!

ఈ ఐస్‌క్రీమ్ తయారీలో ఉపయోగించే పదార్థాలు అత్యంత అరుదైనవి, ఖరీదైనవి. కేవలం ఇటలీలో మాత్రమే లభించే ‘వైట్ ట్రఫుల్స్’ అనే ఒక రకమైన అరుదైన పుట్టగొడుగులను ఇందులో ప్రధానంగా వాడతారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ వైట్ ట్రఫుల్స్ ధర కేజీ సుమారు రూ. 12 లక్షల వరకు ఉంటుంది. వీటితో పాటు అత్యంత నాణ్యమైన, సాంప్రదాయ పద్ధతిలో తయారుచేసిన ప్రత్యేకమైన చీజ్‌ను కూడా ఇందులో మిక్స్ చేస్తారు.

తినగలిగే బంగారం.. వెండి స్పూన్ ఉచితం!

View this post on Instagram

A post shared by Luxurious (@luxuriousbymm)

రుచిలోనూ, లుక్‌లోనూ దీనికి సాటిమరొకటి లేదు. ఐస్‌క్రీమ్ తయారీ పూర్తయిన తర్వాత, దానిపై తినగలిగే స్వచ్ఛమైన బంగారు పొరను (ఎడిబుల్ గోల్డ్ లీఫ్) గార్నిషింగ్‌గా అలంకరిస్తారు. అంటే ఈ ఐస్‌క్రీమ్ తినేటప్పుడు మనం పరోక్షంగా బంగారాన్ని ఆస్వాదిస్తున్నామన్నమాట!

ఇంతటి విలాసవంతమైన ఐస్‌క్రీమ్‌ను తినడానికి సాధారణ ప్లాస్టిక్ లేదా చెక్క స్పూన్లు వాడితే ఏం బాగుంటుంది? అందుకే, ఈ ఐస్‌క్రీమ్‌ను కొనుగోలు చేసిన వారికి, దానిని తినడం కోసం ప్రత్యేకంగా చేతితో డిజైన్ చేసిన ఒక వెండి స్పూన్‌ను కూడా కంపెనీ ఉచితంగా అందిస్తుంది.

చీఫ్ చెఫ్‌ల పర్యవేక్షణలోనే అమ్మకాలు..

అంత ధర పెట్టి కొనుగోలు చేసే వినియోగదారుడికి అత్యుత్తమ అనుభూతిని ఇవ్వాలనేది ఆ సంస్థ లక్ష్యం. అందుకే ఈ ఐస్‌క్రీమ్‌ను మార్కెట్లోకి విడుదల చేసే ముందు, సదరు కంపెనీకి చెందిన ప్రధాన వంటగాళ్లు (చీఫ్ చెఫ్‌లు) ప్రతి బ్యాచ్‌ను స్వయంగా రుచి చూస్తారు. నాణ్యత, రుచి, సువాసన అన్నింట్లోనూ వంద శాతం పర్‌ఫెక్ట్‌గా ఉందని వారు ధృవీకరించిన తర్వాతే దీనిని కస్టమర్లకు విక్రయిస్తారు. ‘పిండి కొద్దీ రొట్టె’ అన్న సామెత చందాన.. అంతటి అరుదైన పదార్థాలు వాడారు కాబట్టే ఆ స్థాయిలో ధర పలికుతోంది.

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రాహు ప్రభావంతో వీరికి అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బే డబ్బు
రాహు ప్రభావంతో వీరికి అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బే డబ్బు
హోటల్ స్టైల్ స్పైసీ ఉల్లిపాయ ఊరగాయ.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు
హోటల్ స్టైల్ స్పైసీ ఉల్లిపాయ ఊరగాయ.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు
అదిరే పెర్ఫామెన్స్‌తో మార్కెట్లోకి రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G
అదిరే పెర్ఫామెన్స్‌తో మార్కెట్లోకి రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G
జాతకంలో సూర్యుడు ఏ ఇంట్లో ఉన్నాడు? 12 భావాల్లో సూర్యుని ఫలితాలు..
జాతకంలో సూర్యుడు ఏ ఇంట్లో ఉన్నాడు? 12 భావాల్లో సూర్యుని ఫలితాలు..
పప్పు, సాంబార్‌లోకి అదిరిపోయే సైడ్ డిష్ బెండకాయ రవ్వ వేపుడు..
పప్పు, సాంబార్‌లోకి అదిరిపోయే సైడ్ డిష్ బెండకాయ రవ్వ వేపుడు..
సీఎం సార్.. ప్లీజ్.. చదువు చెప్పడానికి టీచర్లను ఇవ్వండి సార్
సీఎం సార్.. ప్లీజ్.. చదువు చెప్పడానికి టీచర్లను ఇవ్వండి సార్
నోయిస్‌ నుంచి స్టైలిష్‌ లుక్‌తో కొత్త ఇయర్ బడ్స్‌
నోయిస్‌ నుంచి స్టైలిష్‌ లుక్‌తో కొత్త ఇయర్ బడ్స్‌
తక్కువ బడ్జెట్‌లో 360° థియేటర్ అనుభూతి కావాలా
తక్కువ బడ్జెట్‌లో 360° థియేటర్ అనుభూతి కావాలా
విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే జొన్న పిండి లడ్డులు..
విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే జొన్న పిండి లడ్డులు..
అదనపు ఆదాయం మీ చేతుల్లో: 3 'సైడ్ ఇన్‌కమ్' రహస్యాలు ఇవే
అదనపు ఆదాయం మీ చేతుల్లో: 3 'సైడ్ ఇన్‌కమ్' రహస్యాలు ఇవే