Trending: రొమాన్స్‌లో మునిగి లోకాన్ని మర్చిపోయారు.. కట్ చేస్తే.. సముద్ర గర్భంలోకి..

|

Jun 21, 2024 | 12:15 PM

చల్లటి వాతావరణంలో ఓ ప్రేమజంట సముద్రతీరాన సరదాగా గడుపుతున్నారు. అయితే రాకాసి అలలు ప్రేమికుడి ముందే ప్రియురాలుని సముద్రంలోకి తీసుకెళ్లిపోయాయి. ఈ షాకింగ్ ఘటన జూన్ 16న రష్యాలోని సోచి ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ఈ ఘటన అంతా అక్కడ అమర్చిన కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఈ ఇన్సిడెంట్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Trending: రొమాన్స్‌లో మునిగి లోకాన్ని మర్చిపోయారు.. కట్ చేస్తే.. సముద్ర గర్భంలోకి..
Viral Video
Follow us on

సోషల్ మీడియాలో ఇప్పుడు ఏ చిన్న విషయమైనా క్షణాల్లో వైరలవుతుంది. ప్రపంచంలోని నలుమూలల ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో జనాల ముందుకు వస్తుంది. ఇప్పుడు ఓ షాకింగ్ ఇన్సిడెంట్ నెటిజన్స్ షాక్ కు గురిచేస్తుంది. ఓ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తుఫాను వస్తున్న సమయంలో వారిద్దరు సముద్రతీరాన అలల మధ్య సరదాగా నడుస్తూ కనిపించారు. బలమైన గాలితోపాటు ఎత్తైన అలలు భయంకరంగా ఎగిసిపడుతున్నాయి. అయితే చల్లటి వాతావరణంలో ఓ ప్రేమజంట సముద్రతీరాన సరదాగా గడుపుతున్నారు. అయితే రాకాసి అలలు ప్రేమికుడి ముందే ప్రియురాలుని సముద్రంలోకి తీసుకెళ్లిపోయాయి. ఈ షాకింగ్ ఘటన జూన్ 16న రష్యాలోని సోచి ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ఈ ఘటన అంతా అక్కడ అమర్చిన కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఈ ఇన్సిడెంట్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ముందుగా ఓ జంట సముద్రపు అలల మధ్య నడుచుకుంటూ వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అదే సమయంలో ఎత్తైన అలలు మరింత బలంగా వస్తున్నాయి. ఆ సమయంలో ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. సముద్రపు అలలు ఎగసిపడుతున్నప్పుడు అక్కడే గట్టిగా ప్రారంభించాయి. ఆ సమయంలో అబ్బాయి బలంగా నిలబడగా.. అప్పటివరకు అతడి చేతులు పట్టుకుని నిలబడిన అమ్మాయి అలల తాకిడికి కిందపడిపోయింది. వెంటనే రాకాసి అలలు ఆ అమ్మాయిని సముద్రంలోకి తీసుకెళ్లిపోయాయి. ప్రియురాలిని కాపాడుకోవడానికి అతడు ప్రయత్నించినా లాభం లేకపోయింది. .అక్కడ ఉన్న మరో వ్యక్తి కూడా వారికి సహాయం చేసేందుకు వచ్చాడు. అప్పటికి ఆ అమ్మాయి కొట్టుకుపోయింది. ఆ వ్యక్తి సముద్రపు అలల మధ్య తన ప్రియురాలి కోసం పదేపదే వెతికినా ఆమె కనిపించలేదు.

మీడియా కథనాల ప్రకారం, రెస్క్యూ టీమ్ మూడు రోజులుగా ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నప్పటికీ ఆమె గురించి ఏమీ తెలియరాలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుండగా నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ‘మీకు ఈత తెలిసినప్పటికీ, అలలు మిమ్మల్ని తారుమారు చేస్తాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. తుఫాన్ వస్తున్న సమయంలో సముద్రం వద్దకు వెళ్లకూడదు. బాయ్‌ఫ్రెండ్ ఆమెను రక్షించడానికి ప్రయత్నించలేదని నేను అనుకుంటున్నాను.. అతను మొదటి నుండి ఆమెను ముందుకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆమె వినలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.