Women’s Fight: ఇలా కూడా గొడవ పడతారా..? కర్రలతో నేలకేసి బాదుతూ సాగిన ‘ఎకో ఫ్రెండ్లీ ఫైట్’.. మీరే చూడండి..

|

Mar 11, 2023 | 10:38 AM

వారు ఏం అనుకుంటున్నారో మనకు అర్థం కాకపోవచ్చు కానీ ఎలా గొడవ పడుతున్నారనేది మాత్రం మనల్ని నవ్విస్తుంది. ‘గొడవ అంటే అలాగే జరగాలి. హింస, రక్తపాతం లేని ..

Womens Fight: ఇలా కూడా గొడవ పడతారా..? కర్రలతో నేలకేసి బాదుతూ సాగిన ‘ఎకో ఫ్రెండ్లీ ఫైట్’.. మీరే చూడండి..
Women Scolding Each Other
Follow us on

నీళ్ల కోసం కులాయి లేదా వాటర్ ట్యాంకర్ వద్ద గొడవ పడుతున్న ఆడవారిని మీరు చూసే ఉంటారు.  అలా ప్రత్యక్షంగా చూసే అవకాశం రాకపోయినా.. సినిమాలలో ద్వారా అయినా చూసి నవ్వుకునే ఉంటారు. ఆ గొడవలు ఎక్కడ వరకు వెళ్తాయో కానీ ఆ చుట్టు పక్కల ఉండి చూస్తుండేవారికి ఎంతో సరదాగా ఉంటుంది. ఇతరులు గొడవ పడుతుంటే చూసి నవ్వుకోవడం అనేది మానవ నైజం కూడా కదా..! తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ గొడవ నీటి కోసం అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ గొడవ జరిగిన పరిసరాల్లో ఎక్కడా కూడా కులాయి లేదా వాటర్ ట్యాంకర్ లాంటిది లేదు. ఇక ఆ గొడవలో ఒక మహిళపై ముగ్గురు మహిళలు తగాదా ఆడుతున్నారు. అయితే వారు ఏం అనుకుంటున్నారో మనకు అర్థం కాకపోవచ్చు కానీ వారు ఎలా గొడవ పడుతున్నారనేది మాత్రం మనల్ని నవ్విస్తుంది. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో..దీన్ని చూసిన నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు.

‘పెద్ద గొడవ జరిగింది’ క్యాప్షన్‌తో apna_pyara_jharkhand అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఈ వీడియో షేర్ అయింది. షేర్ అయిన ఈ వీడియోలో.. ఒక మహిళ నేలకేసి కర్రతో బాదుతూ తనకు ఎదురుగా ఉన్న వారితో గొడవ పడుతోంది. అయితే కెమెరా పక్కకు తిప్పి చూపించగా.. ఆమెకు ఎదురుగా ఏకంగా ముగ్గురు ఆడవాళ్లు ఉన్నారు. వారిలో ఇద్దరు కూడా ఆమె లాగానే కర్రతో నేలకేసి కొడుతూ గొడవ పడుతుండగా.. మరో యువ మహిళ చేయిని చూపిస్తూ గొడవ పడుతోంది. ఈ దృశ్యాలను మీరు ఆ వీడియోలో చూడవచ్చు. ఇలా గొడవ సాగుతున్నా.. అక్కడే ఉన్న ఇతర మహిళలు చూస్తూండి పోయారు తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు. నిజానికి వారికి ఏం చేయాలో తొచక చూస్తుండిపోయారు.

కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదా సరదా కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ వీడియోకు ఇప్పటి వరకు 1 కోటి 77 లక్షలకు పైగా వీక్షణలు, 7 లక్షల 10 వేల లైకులు వచ్చాయి. అలాగే 15 వేల కామెంట్లు కూడా లభించాయి. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘ఎకో ఫ్రెండ్లీ ఫైట్’ అని కామెంట్ చేశారు. మరో నెటిజన్ ‘సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ గొడవ పడుతున్నారు’ అని రాసుకురాగా.. ‘గొడవ అంటే అలాగే జరగాలి. హింస, రక్తపాతం లేని తగవులు. దీన్ని చూసి మనం నేర్చుకోవలసిందే..’ అని వ్యాఖ్యనించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..