
ప్రతీ రోజూ డాక్టర్లు తమ కేసులను సాల్వ్ చేయడంలో కుస్తీపట్టులు పట్టాల్సిందే.అయితే మీకు ఇప్పుడు ఓ మెడికల్ కేసు గురించి చెప్పబోతున్నాం.! ఆమె వయస్సు 25 సంవత్సరాలు.. దీర్ఘకాలిక మలబద్దకంతో బాధపడుతోంది. ఎంతలా అంటే.!కడుపు ఉబ్బిపోయి.. చిత్రవిచిత్ర శబ్దాలు, ఉబ్బరం లాంటి సమస్యలతో బాధపడుతూ.. ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. దీంతో వెంటనే సదరు రోగికి వైద్యులు ఎక్స్‌రే తీయగా.. కడుపు కింద భాగంలో బంకమట్టిలాగా ఉందని వైద్యులు కనుగొన్నారు. CT స్కాన్‌లో మలం ఆమె కడుపు కింద భాగంలో పెరుకుపోయినట్టు కనుగొన్నారు.
అంతేకాకుండా స్కాన్‌లో ఆమెకు 15 సెం.మీ పొడవైన అనవసరమైన సిగ్మోయిడ్ పెద్దప్రేగు ఉందని కూడా తేలింది. దాని వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రహించారు. దీంతో ఆ మహిళ మాన్యువల్ డిస్ ఇంపాక్ట్ చేయించుకునేందుకు సిద్దపడింది. గట్టిపడిన మలాన్ని మానవీయంగా విడగొట్టి తొలగించే ప్రక్రియ ఇది. సుమారు రెండు గంటల శస్త్రచికిత్స అనంతరం ఆమెకు ఈ పరిస్థితి నుంచి ఉపశమనం కల్పించారు డాక్టర్లు. డిశ్చార్జ్ అయ్యే సమయానికి, ఆమె బరువు 128.9 పౌండ్ల నుంచి 119 పౌండ్లకు వచ్చింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకోగా.. ఆ రోగి పేరు ఏంటన్నది డాక్టర్లు బయటకు రానివ్వలేదు. డిశ్చార్జ్ అనంతరం ఆమెపై పలు పరిశోధనలు జరిపి.. ఇంటికి పంపారు డాక్టర్లు.
ఇది చదవండి: పొట్ట బొండంలా ఉబ్బిపోయి ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. టెస్టులు చేయగా..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..