
Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోలను జనాలు ఎంతగానో ఇష్టపడుతున్నారు. రీల్స్ చేసే క్రమంలో కొందరికి ఊహించిన షాక్‌లు ఎదురవుతుంటాయి. ఇలాంటి వీడియోలు కూడా ఎక్కువగానే నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి కోవకే చెందిరే ఓ వీడియో వచ్చి చేరింది. ఈ వీడియోలో ఒక అమ్మాయి రీల్ చేసేందుకు సిద్ధమైంది. కెమెరా ముందు డ్యాన్స్ చూస్తే సందడి చేస్తుంది. ఈ తతంగం అంతా అక్కడే గోడపై కూర్చున్న కొండముచ్చు గమనిస్తోంది. ఒక్కసారిగా అమ్మాయి దగ్గరికి రాగానే ఏం చేసిందో చూస్తే కచ్చితంగా నవ్వుకుంటారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగానే విపరీతంగా షేర్ అవుతోంది. కోతులు, కొండముచ్చుల ముందు ఇలాంటి తిక్క వేశాలు వేస్తే పరిస్థితి ఊహించని విధంగా మారిపోతుందని చెప్పడానికి ఈ వీడియో చాలు. కొండముచ్చు ముందు డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో కొండముచ్చు వైపు ఆమె తన చేతిని చూపిస్తూ, డ్యాన్స్ చేస్తుంది. అప్పటి వరకు నిశ్శబ్దంగా కూర్చుని ఇదంతా చూసిన కొండముచ్చు.. ఆ తర్వాత అకస్మాత్తుగా అమ్మాయి జుట్టు పట్టుకుని తన వైపునకు లాగుతుంది. అమ్మాయి వెనక్కి తిరిగిన వెంటనే ఆమె జుట్టును మరింతగా పట్టి లాగి, ప్లాన్ అంతా పాడు చేసేసింది. దీంతో అమ్మాయి కూడా కొండముచ్చుకు వార్నింగ్ ఇచ్చినట్లు చూడొచ్చు. ఇక చేసేందేం లేక అంతటితో రీల్స్ ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
अब तो जानवर भी परेशान को गए है
इन रीलबाजों से।
यकीन न आए तो वीडियो देखें।
😹😹😹😹😹😹😹 pic.twitter.com/5qR2Yi7wX9— Eshika (@syadvada169665) August 19, 2025
ఈ వైరల్ వీడియోపై యూజర్లు కూడా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక యూజర్ ‘నువ్వు కోతి దగ్గరకు ఎందుకు వెళ్ళావు’ అని కామెంట్ చేయగా, మరొక యూజర్ ‘అయ్యో నీ జుట్టు చెడిపోయింది’ అని కామెంట్ చేశాడు. మీరు కూడా ఈ వీడియోని చూసి సరదాగా నవ్వుకోండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..