మాస్క్‏పై బంగారు ముక్కు పుడక.. ఆ మహిళ తెలివి అదుర్స్ అంటున్న నెటిజన్లు.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

|

May 11, 2021 | 8:05 AM

పరిస్థితులు ఎలా ఉన్నా.. అందులో కూడా తమ కంఫర్ట్ వెతుకుంటారు చాలా మంది. ముఖ్యంగా మహిళలు.. ఏ పరిస్థితులలోనైనా.. అలంకారణకే

మాస్క్‏పై బంగారు ముక్కు పుడక.. ఆ మహిళ తెలివి అదుర్స్ అంటున్న నెటిజన్లు.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..
Nath
Follow us on

పరిస్థితులు ఎలా ఉన్నా.. అందులో కూడా తమ కంఫర్ట్ వెతుకుంటారు చాలా మంది. ముఖ్యంగా మహిళలు.. ఏ పరిస్థితులలోనైనా.. అలంకారణకే మొదటి ప్రాధాన్యం. చిన్న ఫంక్షన్స్ నుంచి పెళ్ళిళ్ల వరకు ప్రతి దానిలో అభరణాలు ధరించాల్సిందే. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ కారణంగా మహిళలకు అలంకరించేందుకు అవకాశం లభించడం లేదు. బయటకు వెళ్ళినా.. ఫంక్షన్లలో ఎక్కడైనా మాస్క్ ధరించాల్సిందే. దీంతో మహిళలు లిప్ స్టిక్ వేసుకోవడానికి దూరంగా ఉంటున్నారు. ఇక మరికొందరు మహిళలు మాస్క్ ధరించాల్సి వచ్చినందుకు తమలోని మరో కోణాన్ని బయటకు తీస్తున్నారు. తమ తెలివి ఉపయోగించి మాస్క్ ధరించడంతోపాటు ఆభరణాలను ధరించేస్తున్నారు. తాజాగా ఓ మహిళ చేసిన పనికి నెటిజన్లు అవాక్కు అయ్యారు. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందో తెలుసుకుందామా.

ఉత్తరాఖండ్ లోని నైనితాల్ జిల్లాలో గోదఖాల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తమ సమీప బంధువుల వివాహనికి హజరైంది. ఈ క్రమంలో ఆమె చక్కగా బంగారు ఆభరణాలు ధరించి ఆ పెళ్ళికి వెళ్ళింది. అయితే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అనే ఆంక్షలు ఉండడంతో ఆమె మాస్క్ పైనే బంగారు ముక్కు పుడకను పెట్టుకుంది. దీంతో ఆమెను చూసిన వారంత అవాక్కు అవుతున్నారు. ఒక వైపు మాస్క్ ధరిస్తూనే.. అలంకరణ కూడా చేసుకోవడం పై ఆమె పై నెటిజన్లు వావ్ అంటున్నారు. ఈ ఫోటోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. ఇప్పుడు ఆ ఫోటో తెగ వైరల్ అవుతుంది. మరీ మీరు ఆ ఫోటో చూసేయ్యండి..

ట్వీట్..

Also Read: కష్టకాలంలో ఆపన్నులకు అండగా ‘రాధేశ్యాం’ యూనిట్ . కోవిడ్ బాధితులకు సాయం అందించిన ప్రభాస్, పూజాహెగ్డే టీం…

Sonu Sood: కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు.. రియల్‌ హీరో సోనూసూద్‌ సంచలన నిర్ణయం

MS Raju: డ‌ర్టీ పిక్చ‌ర్ డైరెక్ట‌ర్ నుంచి మ‌రో రొమాంటిక్ కామెడీ చిత్రం.. త‌న‌యుడు నిర్మాత‌, తండ్రి ద‌ర్శ‌క‌త్వం..