Viral Video: ఈమెకింకా భూమిపై నూకలున్నాయనుకుంటా-జస్ట్ మిస్‌ అంతే- వీడియో చూశారాంటే షాకే..!

వీడియోలో.. రైలు వస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, ఆ మహిళ  వస్తున్న రైలును ఏ మాత్రం చూసుకోవటం లేదు.. రైలు హారన్ శబ్ధం కూడా వస్తుంది. కానీ, ఆమె హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ఉండటం వల్ల ఆమెకు హారన్ శబ్దం వినబడలేదు. ఈ కారణంగానే ఆమె ప్రమాదానికి గురైంది. ఇదంతా రెప్పపాటు వ్యవధిలోనే జరిగిపోయింది..ఈ ప్రమాదం ఎంత వేగంగా జరిగిందో చుట్టుపక్కల వారికి కూడా ఏం జరిగిందో అర్థం కాలేదు.

Viral Video: ఈమెకింకా భూమిపై నూకలున్నాయనుకుంటా-జస్ట్ మిస్‌ అంతే- వీడియో చూశారాంటే షాకే..!
Woman Tried To Cross Track

Updated on: Aug 09, 2023 | 9:02 AM

రోడ్డు దాటుతున్నప్పుడు, రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్త వహించిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చేతిలో సెల్‌ఫోన్‌ చూస్తూ రోడ్డు దాటడం, ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని రైలు పట్టాలు దాటడం వంటివి చేస్తూ ఎందరో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న సంఘటనలు అనేకం మనం తరచూ టీవీల్లో వార్తల్లో చూస్తూనే ఉంటాం.. ఇక సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలానే కనిపిస్తుంటాయి. అందులో ప్రజలు తొందరపాటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు, లేదా భయంకరమైన పరిణామాలను ఎదుర్కోన్న దృశ్యాలు మనల్ని షాక్ గురిచేస్తుంటాయి. అయితే, ఇలాంటి సంఘటనల్లో ప్రజలు తమ మూర్ఖత్వం కారణంగా చాలాసార్లు ప్రజలు తీవ్రమైన ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న రైలు ప్రమాదం వీడియో కూడా అలాంటి అజాగ్రత్తనే సూచిస్తుంది. వీడియోలో మహిళ తొందరపాటు విపరీతంగా మారింది.

నిజానికి ఆ మహిళ చెవిలో హెడ్‌ఫోన్స్ పెట్టుకుంది. ఆమె ఏ మాత్రం అటు ఇటు చూసుకోకుండా..కంగారు పడకుండా ప్లాట్‌ఫారమ్ దిగి రైల్వే ట్రాక్ దాటుతోంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. పక్క నుంచి రైలు వస్తోంది.. చెవులకు ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వింటూ ఏదో లోకంలో మునిగిపోయింది. ఆ మరుక్షణంలో ఊహించని ఘటన జరిగింది. ఆ మహిళ ట్రాక్‌పైకి వచ్చిన సమయంలో రైలు కూడా వచ్చింది. పరిమిత వేగంతో దూసుకొచ్చిన రైలు ఆమెను ఢీకొట్టింది. దాంతో ఆమె అవతలి వైపు రైలు పట్టాలపై పడిపోయింది. ఇదంతా రెప్పపాటు వ్యవధిలోనే జరిగిపోయింది..ఈ ప్రమాదం ఎంత వేగంగా జరిగిందో చుట్టుపక్కల వారికి కూడా ఏం జరిగిందో అర్థం కాలేదు.

ఇవి కూడా చదవండి

వీడియోలో.. రైలు వస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, ఆ మహిళ  వస్తున్న రైలును ఏ మాత్రం చూసుకోవటం లేదు.. రైలు హారన్ శబ్ధం కూడా వస్తుంది. కానీ, ఆమె హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ఉండటం వల్ల ఆమెకు హారన్ శబ్దం వినబడలేదు. ఈ కారణంగానే ఆమె ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ రైలు వేగం కొంచెం తక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత కూడా తగ్గువగానే ఉంది. అదే రైలు బలంగా ఢీ కొని ఉండి ఉంటే.. మహిళ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడి ఉండేది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..