Viral Video: మంటతో మ్యాజిక్ చేయబోయింది.. ఊహించని ప్రమాదానికి విలవిల్లాడిపోయింది.. వీడియో వైరల్

|

Aug 13, 2022 | 9:34 PM

సోషల్ మీడియా (Social Media).. ప్రస్తుతం అందరికీ అందుబాటలో ఉండే సామాజిక వేదిక. నిత్యం ఎన్నో రకాల వీడియోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంటాయి. ఇందులో ఆశ్చర్యం కలిగించేవి కొన్నైతే.. భయం పుట్టించేవి మరికొన్ని. వీటిలో నిప్పుకు...

Viral Video: మంటతో మ్యాజిక్ చేయబోయింది.. ఊహించని ప్రమాదానికి విలవిల్లాడిపోయింది.. వీడియో వైరల్
Fire Attack Viral Video
Follow us on

సోషల్ మీడియా (Social Media).. ప్రస్తుతం అందరికీ అందుబాటలో ఉండే సామాజిక వేదిక. నిత్యం ఎన్నో రకాల వీడియోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంటాయి. ఇందులో ఆశ్చర్యం కలిగించేవి కొన్నైతే.. భయం పుట్టించేవి మరికొన్ని. వీటిలో నిప్పుకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. అగ్నితో (Fire) చేసే మ్యాజిక్, స్టంట్స్ ను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. నిప్పు అనేది ఆడుకునే సాధనం కానప్పటికీ కొందరు నిపుణులు వాటితో స్టంట్స్ చేస్తూ మనకు వినోదాన్ని పంచుతారు. అగ్ని చాలా ప్రమాదకరమైనదనే విషయం మనకు తెలిసిందే. పెద్ద పెద్ద అడవులను సైతం కాల్చి బూడిద చేసేయగలదు. అందుకే అగ్నిని ఉపయోగించిన తర్వాత ఆర్పివేయాలి. అగ్నికి గాలి తోడైతే అది తీవ్ర వినాశకానికి దారి తీస్తుంది. కొంతమంది నిప్పుతో ఆడుకోవడం కనిపించినప్పటికీ.. కొన్నిసార్లు వారు దాని పర్యవాసాన్ని భరించాల్సి వస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో (Video) ఓ మహిళ నిప్పుతో స్టంట్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ మహిళ నోటిలో నూనె పోసుకుని మండుతున్న మంటపై చిమ్మతుంది. అదే సమయంలో ఆమె నోటి నుంచి నూనెను చిమ్మిన వెంటనే మంటలు ఎగిసిపడి ఆమె ముఖానికి అంటుకున్నాయి. ఆమె ఆర్పేందుకు ప్రయత్నిస్తూ కిందపడిపోవడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

ఈ హెయిర్ రైజింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 10 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత రకరకాల రియాక్షన్లు ఇస్తున్నారు. నిప్పుతో ఎప్పుడూ ఆడకూడదని, లేకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..