పెద్ద నగరాల్లో ఏదైనా పోగొట్టుకుంటే దాన్ని తిరిగి పొందడం కష్టం. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైట్ ఇచ్చినా.. వాలెట్, మొబైల్, ల్యాప్‌టాప్ వంటి ఏ వస్తువు పోగొట్టుకున్నా.. తిరిగి వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఒకరి చేతి నుంచి మరొకరికి వస్తువులు మారుతున్నాయి. క్షణాల్లో వాటిని కనిపించకుండా చేసే కేటుగాళ్లు ఎక్కడ చూసినా ఎక్కువయ్యారు. అయితే అందుకు విరుద్ధంగా ముంబైలో ఓ మహిళ తన మొబైల్ ఐ ఫోన్ పోగొట్టుకుని తిరిగి సంపాదించుకుంది. ముంబయి వంటి అతిపెద్ద నగరంలో ఎదుటి వారికి సాయం చేసే స్ఫూర్తి ఇంకా బతికే ఉందంటూ సదరు మహిళ షేర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
ముంబై యునైటెడ్‌లో పోగొట్టుకున్న ఐఫోన్‌ను తిరిగి పొందడంలో ఆటోరిక్షా డ్రైవర్లు ఎలా సహాయం చేశారో మహిళ వివరంగా షేర్ చేసింది. నా మొబైల్‌ను వెతకటంలో సహాయపడటానికి ఆటో డ్రైవర్లు, స్విగ్గీ డెలివరీ బాయ్స్ తమ పనులు వదిలేసుకుని కష్టపడ్డారంటూ మహిళ వివరించింది. ఈ పోస్ట్‌ని హిస్టరీ వ్యాలీ అనే వినియోగదారు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ట్విట్ మేరకు.. నేను రెండు సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన నా ఖరీదైన ఐఫోన్‌ను పోగొట్టుకున్నాను.ఈ మొబైల్‌ని తిరిగి పొందేందుకు పరిచయం లేని వ్యక్తి నాకు ఎలా సహాయం చేశాడో వివరించాడు.
‘నేను వెరసోవా మెట్రో స్టేషన్‌లో ఉన్నాను. ఈ సందర్భంగా నా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న విషయం తెలిసింది. నేను వెంటనే ఆటో స్టాండ్‌కి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఆటో దింపిన వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించాను. కానీ, అతను ఎవరో నాకు తెలియదు. అప్పుడే ఓ ఆటో డ్రైవర్ మీరు నా ఆటోలోనే వచ్చారంటూ చెప్పాడు. కానీ, తన ఆటోలో పడిపోయిందనుకున్న మొబైల్ కోసం వెతకగా అది కనిపించలేదు. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న మిగతా ఆటో డ్రైవర్లంతా తన మొబైల్ నంబర్‌కు ఫోన్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే రింగ్ అవుతున్నా చాలా సేపటి వరకు ఎవరూ కాల్ రిసీవ్ చేసుకోలేదు. ఇక లాభం లేదనుకుని.. ఆ ఆటో డ్రైవర్ ఫోన్ నంబర్ తీసుకుని నిరాశతో తిరిగి వెళ్లిపోయారు. అయితే ఆటోడ్రైవర్‌లు ఫోన్ చేయడంతో నా మొబైల్‌ని ఎవరో రిసీవ్ చేసుకొని డిఎన్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో మొబైల్ దొరికిందని చెప్పారు’ అని మహిళ చెప్పింది.
Thread.
I lost my phone this morning.
iPhone 12 mini, which I’ve had for about 2 years.I was going up the escalator at the Versova Metro station, when I reached into my bag and had my ‘waitaminute where the fuck is my phone???!’ moment.
Heart sank.— Historywali (@historywali) July 2, 2023
రెయిన్ కోట్ వేసుకుని వర్షంలో తడుస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ చేతిలో మొబైల్ దొరికింది. మొబైల్ ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు. ఇది చూసి భావోద్వేగానికి గురయ్యానని మహిళ వివరించింది. అంతే కాదు, ‘స్విగ్వీ డెలివరీ బాయ్ రాహుల్ కుమార్, ఆటో డ్రైవర్లు నీలేష్, ప్రకాష్ అందరూ ముంబైపై నా నమ్మకాన్ని నిజం చేశారు. నగర ప్రజలలో మానవత్వం, దయ ఇంకా సజీవంగా ఉన్నాయని అతను నిరూపించాడు’ అని మహిళ ట్వీట్‌లో పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..