మీ ఇంట్లో ఉన్న మిక్సర్ మొరాయిస్తోందా..? ఈ అక్క చెప్పిన ట్రిక్‌ ట్రై చేస్తే.. పైసా ఖర్చు లేకుండానే..

ఈ వీడియోలో ఒక మహిళ మిక్సర్ గ్రైండర్ బ్లేడ్లను పదును పెట్టడానికి ఒక అద్భుతమై ట్రిక్‌ ప్లే చేసింది. తాను చేసిన ఉపాయాన్ని వీడియో తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేయటంతో అది కాస్త వైరల్ అవుతోంది. మీ మిక్సర్ బ్లేడ్ అంచులు మొండిగా మారినట్టయితే, ఇంట్లోని మీరు దానికి పదును పెట్టుకోవచ్చు.. పైగా మీరు అందుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అదేలాగో వైరల్‌ అవుతున్న వీడియోలో చూడాల్సిందే..

మీ ఇంట్లో ఉన్న మిక్సర్ మొరాయిస్తోందా..? ఈ అక్క చెప్పిన ట్రిక్‌ ట్రై చేస్తే.. పైసా ఖర్చు లేకుండానే..
Sharpen Mixer Grinder Blade

Updated on: Apr 10, 2025 | 1:30 PM

ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అలాంటి వీడియోలు కొన్ని మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తాయి. మరికొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. కొన్ని ఆనందాన్నిచ్చేవిగా ఉంటే.. మరికొన్ని అనుసరించేవిగా కూడా ఉంటున్నాయి. మరికొన్ని ప్రజలు చేసే జుగాడ్‌ ఆలోచనలకు సంబంధించినవి కూడా ఉంటున్నాయి. డబ్బు ఖర్చు లేకుండా నిమిషాల్లో కష్టమైన పనులు కూడా ఈజీగా చేసుకునే కొందరు కొత్త కొత్త ఉపాయాలను చూపిస్తుంటారు. ఈ హ్యాక్‌లు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో వాటిని ప్రయత్నించినప్పుడే తెలుస్తుంది. అలాంటిదే ఈ వీడియో కూడా. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఈ వీడియోలో ఒక మహిళ మిక్సర్ గ్రైండర్ బ్లేడ్లను పదును పెట్టడానికి ఒక అద్భుతమై ట్రిక్‌ ప్లే చేసింది. తాను చేసిన ఉపాయాన్ని వీడియో తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేయటంతో అది కాస్త వైరల్ అవుతోంది. మీ మిక్సర్ బ్లేడ్ అంచులు మొండిగా మారినట్టయితే, ఇంట్లోని మీరు దానికి పదును పెట్టుకోవచ్చు.. పైగా మీరు అందుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అదేలాగో వైరల్‌ అవుతున్న వీడియోలో చూడాల్సిందే..

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియోలో ఆ మహిళ మిక్సర్ బ్లేడ్లను పదును పెట్టడానికి ఖాళీ మెడిసిన్ స్ట్రిప్‌ను ఉపయోగిస్తుంది. ఆమె వాడేసిన మందుల కవర్లను చిన్న ముక్కలుగా కోసి ఆ ముక్కలన్నింటినీ మిక్సర్‌లో వేసి బాగా గ్రాండ్‌ చేస్తుంది. వీడియో చివరిలో ఆ మహిళ మిక్సర్ మూత తెరిచి అందులో వేసిన మందుల స్ట్రిప్‌లు చెక్కుచెదరకుండా ఉన్నాయని చూపిస్తుంది. కానీ మిక్సర్ బ్లేడ్ అంచులు మాత్రం పదునుగా మారటం కనిపిస్తుంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియోను @shiprarai2000 అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనికి క్యాప్షన్‌గా ఆమె ఇలా రాసింది, ‘ఈ విధంగా మీ మిక్సర్ బ్లేడ్ పదునుగా మారుతుంది!’ ఎటువంటి ఖర్చు లేకుండా అంటూ.. కాగా, ఈ వైరల్ రీల్‌ను ఇప్పటివరకు 2 లక్షలకు పైగా వీక్షించారు. అనేక మంది దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..