Bear Video: షైర్ కొచ్చి స్నాక్స్ తింటున్న ఎలుగుబంటిని తిట్టిన మహిళ.. పిల్లిలా పారిపోయిన బన్నీ.. వీడియో వైరల్

|

Oct 10, 2022 | 4:44 PM

ప్రమాదకరమైన ఎలుగుబంట్లను నియంత్రించడం చాలా కష్టమైన పని అయినప్పటికీ.. వైరల్ వీడియోలో భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. ఇందులో ఓ మహిళ ఎలుగుబంటిని అదుపు చేస్తూ కనిపించింది.

Bear Video: షైర్ కొచ్చి స్నాక్స్ తింటున్న ఎలుగుబంటిని తిట్టిన మహిళ.. పిల్లిలా పారిపోయిన బన్నీ.. వీడియో వైరల్
Bear Video
Follow us on

సింహం, పులి, చిరుతపులి, ఎలుగుబంట్లు వంటివి అడవిలో నివసించే కౄర జంతువులు. ఇవి మాంసాహారులు చాలా ప్రమాదకరమైనవి. వీటిని చూడడానికి కూడా మనుషులు భయపడతారు. ఎలుగుబంట్లు కూడా సింహం, పులి వంటి జంతువులతో పోటీ పడగలిగే శక్తివంతమైన జంతువు ఎలుగుబంటి. ఒకొక్కసారి ఈ జంవుతులు ఊళ్ళ మీద పడి హల్ చల్ చేస్తాయి. మనుషులను భయబ్రాంతులకు గురి చేస్తాయి. అయితే యూరప్ ఖండంలో బ్రౌన్ ఎలుగుబంట్లు అతిపెద్ద క్రూర జంతువుగా పరిగణించబడుతోంది. భారతదేశంలో.. ఎలుగుబంట్లు సాధారణంగా అడవులలో లేదా జంతుప్రదర్శనశాలలలో మాత్రమే కనిపిస్తాయి. అయితే చాలా దేశాల్లో అవి జన జీవన స్రవంతి ప్రాంతాల్లో తిరుగుతూ కొన్నిసార్లు మనుషులపై దాడి చేస్తాయి. అలాంటి ఎలుగుబంటికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ప్రమాదకరమైన ఎలుగుబంట్లను నియంత్రించడం చాలా కష్టమైన పని అయినప్పటికీ.. వైరల్ వీడియోలో భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. ఇందులో ఓ మహిళ ఎలుగుబంటిని అదుపు చేస్తూ కనిపించింది. ఎలుగుబంటి వెంటనే అక్కడి నుండి పారిపోయే విధంగా ఆ మహిళ చేసింది. ఇంటి ముందు పార్క్ చేసిన ఓ కారు దగ్గర ఎలుగుబంటి తిరుగుతూ మెల్లగా కారు డోర్ తెరిచి హాయిగా కారులోకి ప్రవేశించడాన్ని వీడియోలో చూడవచ్చు. ఎలుగుబంటి కారు లోపల నుండి కొన్ని స్నాక్స్ ను బయటకు తీసింది. ఇంతలో అక్కడికి ఒక మహిళ చేరుకుంది. ఏదో పెంపుడు కుక్కపిల్లని ఆదేశించినట్లు.. ఎలుగుబంటిని కారు నుండి దిగమని ఆదేశించింది. అప్పుడు ఆ స్త్రీ ఆజ్ఞను విన్న ఎలుగుబంటి మౌనంగా నెమ్మదిగా కారు దిగి పారిపోయింది.

పిల్లిలా మారిన ఎలుగుబంటి:

ఇవి కూడా చదవండి

ఎలుగుబంటిని ఇలా నియంత్రించడం సర్కస్ లో తప్ప.. సర్వసాధారణంగా కనిపించదు. ఈ షాకింగ్ వీడియో u/Souled_Out అనే ID తో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్‌లో భాగస్వామ్యం చేయబడింది. 41 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు ఇప్పటి వరకు 60 వేలకు పైగా లైక్‌లు రాగా, వేలాది మంది ప్రజలు వివిధ రకాల కామెంట్స్ చేశారు. నిజానికి అది ప్రమాదకరమైన ఎలుగుబంటి అయితే.. ఆ మహిళపై దాడి చేసి ఉండేదని.. అది మంచి ఎలుగుబంటి అని కామెంట్ చేశారు. ‘కెనడాలోని కొన్ని ప్రదేశాలలో ఈ ఎలుగుబంట్లు పెద్ద సమస్య’ అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..