
పిల్లులు, కుక్కలు మనుషులతో గడిపిన వివిధ క్షణాల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అనేకం హల్ చల్ చేస్తున్నాయి. వీటిలో చాలా వీడియోలు హృదయాన్ని తాకుతాయి. ఈ క్రమంలోనే జంతుహింస ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్న చోట ఇలాంటి వీడియోలు మంచి అనుభూతిని కలిగిస్తాయి. అలాంటి హృదయపూర్వక వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ ఒక మహిళ, రెండు పిల్లులకు సంబంధించినది. ఈ వీడియోలో ఒక మహిళ ప్లాస్టిక్ సంచిలో చెత్త కుప్పలో పడి ఉన్న రెండు పిల్లులను గుర్తించింది. అది చూసిన ఆమె వెంటనే వాటిని రక్షించడానికి పూనుకుంది. ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
వైరల్‌గా మారిన వీడియోలో చెత్త కుప్పలో పడి ఉన్న ప్లాస్టిక్ సంచిలో నుండి రెండు పిల్లి పిల్లలు బయటకు తీస్తున్నట్లు చూపిస్తుంది. తర్వాత వాటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుంటుంది. ఆమె వాటిని మెల్లగా దగ్గరకు తీసుకోవటం కనిపిస్తుంది. పిల్లి పిల్లలను అలాంటి ధీన స్థితిలో చూసిన ఆమె చలించిపోయింది. వాటికి ఏమవుతుందోనని ఆందోళన పడిపోవటం వీడియోలో స్పష్టంగా కనిపించింది. పిల్లి పిల్లలను ఎత్తుకుని.. మూగజీవాలను ఇలా ఎలా వదిలేస్తారంటూ మండిపడింది. ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి చెత్తలో పడేస్తే అవి ఏమైపోతాయి. వీధి కుక్కలు వాటిని చంపేస్తే పరిస్థితి ఏంటని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ వీడియో క్యాప్షన్‌లో ‘‘పిల్లి పిల్లలను ఇలా చెత్తకుప్పల్లో ఎలా పడవేస్తారు..? అలాంటి వారిని ఏమనాలో నాకు మాటలు రావడం లేదు. మహిళ రాత్రిపూట వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు బయటకు వెళ్లినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. అప్పుడు అకస్మాత్తుగా లిట్టర్ బాక్స్ నుండి పిల్లుల మియావ్ శబ్ధం వినిపించింది. అన్నీ వదిలేసి దాని వైపు పరుగెత్తింది. ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పడేసిన రెండు పిల్లి పిల్లలను రక్షించింది.
తాజాగా, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ స్ట్రే క్యాట్ లవర్ పోస్ట్ చేసింది. దీంతో వెంటనే ఈ వీడియో వైరల్‌గా మారింది. మహిళ చేసిన ఈ చొరవ చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. “మీకు ధన్యవాదాలు,మీరు ఈ ఈ రెండు మూగజీవాల జీవితాలను రక్షించినందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు” అని ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు రాశారు. మొత్తానికి పిల్లి పిల్లలను రక్షించిన సదరు మహిళ పట్ల నెటింట ప్రశంసలు వెల్లువెత్తాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..