Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: 50 అడుగుల లోతు బావిలో పడినా ఆమె బతికింది..! వీడియో చూస్తే షాక్ అవుతారు..

Viral Video : కేరళలలోని వయనాడ్‌లో 50 ఫీట్ల లోతుగల బావిలో పడిపోయిన ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. అగ్నిమాపక

Viral Video: 50 అడుగుల లోతు బావిలో పడినా ఆమె బతికింది..! వీడియో చూస్తే షాక్ అవుతారు..
Viral Video
Follow us
uppula Raju

|

Updated on: Aug 12, 2021 | 12:08 PM

Viral Video: కేరళలలోని వయనాడ్‌లో 50 ఫీట్ల లోతుగల బావిలో పడిపోయిన ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. అగ్నిమాపక శాఖవారు ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ప్రమాదవశాత్తు 50 అడుగుల లోతు బావిలో పడిపోయిన మహిళను స్థానికులు గుర్తించి అగ్నిమాపక శాఖవారికి సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకొని ఆమెను కాపాడుతారు. ఆ దృశ్యాలను మనం వీడియోలో చూడవచ్చు. అగ్ని మాపక సిబ్బంది, స్థానికులు కలిసి ఓ నిచ్చెన లాంటి తాడును బావిలోకి దింపుతారు. అనంతరం ఆ మహిళ నెమ్మదిగా ఆ నిచ్చెన తాడుపై నిలుచుంటే పైన వీరందరు బలంగా దానిని పైకి లాగడం మనం గమనించవచ్చు. చివరకు ఎలాగోలా బావి నుంచి బయటికి వస్తుంది. కానీ ఆమెకు గాయాలేమైనా అయ్యాయా అనే వివరాలు తెలియలేదు.

అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. కామెంట్స్, షేర్స్ చేస్తున్నారు. మహిళను కాపాడినందుకు అగ్ని మాపక సిబ్బందిని, స్థానిక జనాలను అభినందిస్తున్నారు. కొంతమంది ఆ మహిళకు ఇంకా భూమిపై అయుష్షు ఉందని కామెంట్ చేశారు. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో జార్ఖాండ్‌లో ఓ లోతైన బావిలో పడిపోయిన ఏనుగును 8 గంటలు కష్టపడి పైకి తీసుకొచ్చారు. ఈ వీడియో కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది.

నిర్మల్ జిల్లా సౌంన్లీ గ్రామ సర్పంచ్‌పై వేటు.. ఈజీఎస్ ఉద్యోగిపై పెట్రోల్ దాడి చేసినందుకు విధుల నుంచి తొలగింపు..

R. Narayanamurthy: సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శం.. రైతుబంధుపై ఆర్. నారాయణ మూర్తి వ్యాఖ్యలు..

Kidnap And Murder Case: రియల్టర్ విజయ్ భాస్కర్‌రెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ప్రముఖ బాబా అరెస్ట్..