తుపాన్ కారణంగా అమెరికాలోని ఫ్లోరిడా నగరం అల్లకల్లోలంగా మారింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆ నగర ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలామంది ఇంటికే పరిమితయ్యారు. అయితే ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా రిపోర్టర్లు డ్యూటీకి వెళ్లాల్సిందే. వాతావరణ పరిస్థితులను, క్షేత్ర స్థాయిలో ప్రజల అవస్థలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇవ్వాల్సిందే. కైలా అనే మహిళా రిపోర్టర్ కూడా భీకర వానలో రిపోర్టింగ్‌కు వెళ్లింది. అయితే వర్షంలో తన మైక్ తడిచే అవకాశం ఉండడతో ఆమె వినూత్నంగా ఆలోచించింది. తన దగ్గర ఉన్న మైక్‌కు ఏకంగా కండోమ్ తొడిగింది. ఇలా కండోమ్ తొడిగిన మైక్‌తో కైలా రిపోర్టింగ్ చేస్తోన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మాములుగా మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వర్షంలో తడవకుండా ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తుంటాం. కానీ కైలా తన మైక్‌ను వర్షంలో తడవకుండా ఏకంగా కండోమ్‌తో కవర్ చేసింది. ఈ ఫొటోజను చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కండోమ్‌ను ఇలా కూడా వాడొచ్చా అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మహిళా రిపోర్టర్ దగ్గర ఆ సమయంలో కండోమ్ ఎందుకు ఉంది? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. తన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, పలు సందేహాలు తలెత్తడంతో కైలా స్పందించింది. ‘ ఇక్కడ గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అందుకే రిపోర్టింగ్ చేసే సమయంలో నా మైక్రో ఫోన్ తడవకుండా ఉండేందుకే ఇలా కండోమ్‌తో కవర్ చేశాను ‘ అని చెప్పుకొచ్చింది.
There’s resourceful, and then there’s RESOURCEFUL: NBC2’s Kyla Galer went viral on Wednesday for using a condom to keep her microphone dry while reporting on the ground in Ft. Myers, FL, during Hurricane Ian. pic.twitter.com/V8fZvPZ1oR
— NowThis (@nowthisnews) October 2, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..