అప్పుడప్పుడూ మనం అనుకున్నదొక్కటయితే.. జరిగేది వేరొక్కటయితది. సరిగ్గా ఓ మహిళకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఆమె తనకిష్టమైన ఫుడ్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టింది. ఇక ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేసి చూడగా.. అక్కడ కనిపించింది చూసి సదరు మహిళ మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇంతకీ అసలేం జరిగిందంటే.?
జోమాటో ద్వారా తనకు ఎదురైనా షాకింగ్ అనుభవాన్ని ఓ మహిళ ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకుంది. నిరుపమ సింగ్ అనే మహిళ సదరు ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా వెజిటేరియన్ మీల్ ఆర్డర్ చేయగా.. తన ఇంటికొచ్చిన పార్శిల్‌లో చికెన్ డిష్ దర్శనమిచ్చిందని.. ఆమె పేర్కొంది. ‘హాయ్ జోమాటో, వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ పెడితే.. నాన్-వెజ్ ఫుడ్ వచ్చింది. పైగా 4/5 మంది పూర్తి శాఖాహారులం. ఈ సర్వీస్ ఏంటి.? చాలా భయంకరమైన ఎక్స్‌పీరియన్స్’ అంటూ ఆమె పోస్ట్‌లో రాసుకొచ్చింది.
ఇక ఈ ఘటనపై స్పందించిన జోమాటో.. సదరు మహిళకు క్షమాపణలు చెప్పింది. అలాగే దీనిపై పూర్తి దర్యాప్తు చేసి.. అసలు ఎలా పొరపాటు జరిగిందన్న విషయం విచారిస్తామని తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి ఇప్పటివరకు 1 మిలియన్ వ్యూస్ రావడంతో పాటు 104 రీ-ట్వీట్స్ కూడా వచ్చాయి. ‘ఇదొక పీడకల లాంటిదని’ ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇది ముమ్మాటికీ రెస్టారెంట్ తప్పు’ అని మరొకరు తన అభిప్రాయాన్ని తెలిపారు.
కాగా, ఇలాంటి ఘటనలు జరగడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో కాఫీ ఆర్డర్ చేయగా.. అందులో అతడికి చికెన్ ముక్క కనిపించింది. దీనికి ఫుడ్ డెలివరీ యాప్, రెస్టారెంట్ సదరు వినియోగదారుడికి వ్యక్తిగతంగా క్షమాపణలు కూడా చెప్పాయి.
Hi Nirupama, we sincerely apologise for this mishap. Please share your registered phone number over a private message for us to investigate this further. https://t.co/HKlpIlJeIq
— zomato care (@zomatocare) March 4, 2023